Telangana Crime News: బస్సు టైర్లు పగలి.. ఒక్కసారిగా తీవ్ర విషాదం..
Sakshi News home page

బస్సు టైర్లు పగలి.. ఒక్కసారిగా తీవ్ర విషాదం..

Aug 22 2023 1:32 AM | Updated on Aug 22 2023 2:01 PM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: మండల పరిధిలోని నాగర్లబండతండాకు చెందిన రాత్లావత్‌ మంగ్యా (45) సోమవారం నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 4 సంవత్సరాల క్రితం కుటుంబాన్ని పోషించుకునేందుకు నల్గొండకు వెళ్లిన మంగ్యా అక్కడ కూలీ పని చేసేవాడని తండా వాసులు తెలిపారు.

సోమవారం ఉదయం ప్రైవేట్‌ బస్సు టైర్లు బస్ట్‌ అవ్వడంతో బైక్‌పై వెళ్తున్న మంగ్యాను ఢీకొట్టినట్లు వివరించారు. దీంతో ఘటనా స్థలంలోనే అతను మృతి చెందినట్లు పేర్కొన్నారు. మంగ్యాకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని స్థానికులు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement