ప్రతి రోజూ ఫిర్యాదుల స్వీకరణ: కలెక్టర్‌

- - Sakshi

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): వివిధ సమ స్యల పరిష్కారం నిమిత్తం తనకు కలిసేందుకు ప్రతిరోజూ ఓ నిర్దేశిత సమయాన్ని కేటాయిస్తున్నట్లు కలెక్టర్‌ రవినాయక్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం ఉద యం 10గంటల నుంచి ప్రజలు వార సమస్యలను ఐడీఓసీలోని సమావేశమందిరంలో తన ను కలిసి విన్నవించుకోవచ్చని, మంగళవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ సాయంత్రం 4.30గంటల నుంచి 6 గంటల వరకు వినతిపత్రాలు, ఫిర్యాదులు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదులు సమర్పించేందుకు ఫిర్యా దుదారులు మాత్రమే రావాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం మాత్రమే ఈ నిర్దేశిత సమయాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

ముగిసిన ఇంటర్‌ఫస్టియర్‌ పరీక్షలు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు మంగళవారం ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 32 పరీక్ష కేంద్రాల్లో 10,895 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 11,342 మంది విద్యార్థులకు 447 మంది గైర్హాజరయ్యారు.డీఐఈఓ వెంకటేశ్వర్లు, ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ అధికారులు పలు పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు. బుధవారం ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు కూడా పూర్తి కానున్నాయి.

యువత మేధాసంపత్తితో మెలగాలి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: యువత మేధా సంపత్తితో మెలగాలని పీయూ వీసీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూ నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన యువజనోత్సవ్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. మేధాసంపత్తితో అనేక రంగాలలో పోటీ పడుతూ దేశాన్ని ఆర్థికంగా పరుగులు పెట్టించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భవిష్యత్‌ యువత చేతిలో ఉందని, వారు నిర్ణయిత లక్ష్యాలను చేరుకునే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన యువత జానపద, నృత్య కళారూపాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్ర సంఘటన్‌ డైరెక్టర్‌ విజయ, అధ్యాపకులు, యువత పాల్గొన్నారు.

మోసాలకుపాల్పడితే చర్యలు

జిల్లా వ్యవసాయశాఖ అధికారి

వెంకటేష్‌

మహబూబ్‌నగర్‌ రూరల్‌: విత్తనాల అమ్మకాల్లో డీలర్లు మోసాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.వెంకటేష్‌ హెచ్చరించారు. మంగళవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ పట్టణంలోని విత్తనశుద్ధి కేంద్రాలు, డీలర్‌ షాపులను తనిఖీ చేశారు. అనుమతి పత్రాలు, ప్రాసెసింగ్‌ ఫౌండేషన్‌ రిజిస్టర్లు, లైసెన్స్‌లు, స్టాక్‌ రిజిస్టర్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ ప్రాసెసింగ్‌ రిజిస్టర్లు, లైసెన్స్‌, మార్కెటింగ్‌ అగ్రిమెంట్‌ తదితర వాటిని విత్తనాలు విక్రయించే డీలర్లు తప్పనిసరిగా దుకాణాల్లో ప్రదర్శించాలని సూచించారు. గడువు తీరిన విత్తనాలు విక్రయించరాదని, లూజ్‌ విత్తనాలు అమ్మరాదని తెలిపారు. తనిఖీలో ఏఓ శ్యామ్‌యాదవ్‌ ఉన్నారు.

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top