ఖర్చు చేయకుంటే వెనక్కే

- - Sakshi

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల నిర్వహణకు సంవత్సరం పొడవునా ప్రభుత్వం ప్రతి సంవత్సవం నిధులు విడుదల చేస్తుంది. ఇందుకోసం పాఠశాలల విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చింది. సకాలంలో అవసరాలకు అనుగుణంగా నిధులు వినియోగించుకోవాల్సి ఉంటుంది. వినియోగించుకోకపోతే డబ్బులు మార్చి నెల అనంతరం వెనక్కి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో చివరి రోజులు కావడంతో అవసరమైన నిధులను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో 2022– 23 విద్యా సంవత్సరానికి సంబంధించిన జిల్లాలో 80,280 మంది విద్యార్థులకు గాను ప్రభుత్వం 2 జతల యూనిఫాంలను కుట్టేందుకు టైలర్లకు కాంట్రాక్టు ఇస్తుంది. మొత్తం 1.60 లక్షల యూనిఫాంలను కుట్టగా.. వీటి బిల్లులు ఆర్థిక సంవత్సరం చివరలో మూడు రోజుల ముందు విడుదల చేయడంతో వీటిని డ్రా చేసుకునేందుకు పాఠశాలల హెచ్‌ఎంలు నానా తంటాలు పడుతున్నారు.

రెండు దఫాల్లో కేటాయింపు

జిల్లాలోని 12 మండల వనరుల కేంద్రాలకు ప్రభుత్వం రెండు దఫాల్లో మొత్తం రూ.83 వేలను కేటాయిస్తుంది. వీటిని ఎమ్మార్సీ నిర్వహణకు కరెంట్‌, టెలిఫోన్‌ బిల్లులు, ఇంటర్నెట్‌, టీ, స్టేషనరీ ఇతర ఖర్చుల కోసం వెచ్చించాలి. పాఠశాలల నిర్వహణలో స్టేషనరీ, సబ్బులు, ఫినాయిల్‌, ఆట వస్తువుల కొనుగోలు వంటి వాటికి ఇస్తుంది. ఇక క్లస్టర్‌ రీసోర్సు సెంటర్లు 53 ఉండగా వీటిలో ఉపాధ్యాయులు కాంప్లెక్సు సమావేశాలు, స్టేషనరీ, నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం నిధులను కేటాయిస్తుంది. అలాగే మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులను అందజేస్తుంది. ఇలా వివిధ రూపాల్లో వచ్చిన బిల్లులను పాఠశాలల హెచ్‌ఎంలు ఎస్‌ఎంసీ అనుమతితో పబ్లిక్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం, వెబ్‌సైట్‌లో పొందుపర్చి అనంతరం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. నెలాఖరులోగా వినియోగించని నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకునే అవకాశం ఉంది.

ఆర్థిక సంవత్సరం ముగింపుతో అధికారుల అప్రమత్తం

పాఠశాల, ఎమ్మార్సీల ఖాతాల్లో పేరుకుపోయిన నిధులు

మూడు రోజుల క్రితమే యూనిఫాం నిధులు రూ.86 లక్షలు జమ

సకాలంలో వినియోగించుకోవాలి..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు రావడంతో ప్రభుత్వం పాఠశాలలు, ఎమ్మార్సీలకు ఇచ్చిన బిల్లులను అవసరానికి అనుగుణంగా, నిబంధనల ప్రకారం ఎంఈఓలు, హెచ్‌ఎంలు నెలాఖరులోగా వినియోగించుకోవాలి. అలా వినియోగించుకోకుండా ఖాతాల్లో ఉన్న నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. – యాదయ్య, డీఈఓ

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top