బిగుస్తున్న ఉచ్చు! | - | Sakshi
Sakshi News home page

బిగుస్తున్న ఉచ్చు!

Nov 27 2026 12:56 AM | Updated on Nov 27 2026 12:56 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 27 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

సాక్షి, మహబూబాబాద్‌: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం దిగుమతి చేసుకుని సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) పెట్టని పలు వురు మిల్లర్ల చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒక వైపు సీబీఐ అధికారులు, మరో వైపు విజిలెన్స్‌, ఇంకోవైపు జిల్లా అధి కారులు.. ఇలా అన్ని వైపులా నుంచి ఉచ్చు బిగించి డబ్బులు వసూలుచేయడమే లక్ష్యంగా కార్యాచరణ మొదలు పెట్టారు. అయితే మిల్లర్ల ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేయగా.. ఇప్పటికే మిల్లులపై తీసుకున్న బ్యాంకు రుణాల పరిస్థితి ఏమిటనేది చర్చగా మారింది.

వందశాతం సీఎంఆర్‌ పెట్టని 16 మిల్లులు..

నాలుగైదు సంవత్సరాల నుంచి ధాన్యం దిగుమతి చేసుకునుడే తప్ప.. తిరిగి బియ్యం పెట్టని వారు 16 మంది రైస్‌ మిల్లుల యజమానులు ఉన్నట్లు అధికా రులు చెబుతున్నారు. తీసుకున్న ధాన్యం మిల్లింగ్‌ చేయకుండా వెంటనే బహిరంగ మార్కెట్‌లో ధా న్యం అమ్మినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అటు ధాన్యం లేదు.. ఇటు బియ్యం లేకుండా ఉన్న విషయం ఇటీవల రాష్ట్రస్థాయి అధికారుల తనిఖీల్లో బయటపడింది. అయితే వారి వద్ద నుంచి సీఎంఆర్‌ పెట్టించేందుకు ప్రయత్నాలు చేయాల్సిన అధికారులు మాముళ్లకు అలవాటు పడినట్లు ఆరోపణలు వస్తున్నారు. దీంతో ఆయా మిల్లర్లు రూ. 30కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, ఇటీవల జరుగుతున్న పరిణామాలతో ఎప్పుడు ఏ ఆస్తులు జప్తు చేస్తారోనని మిల్లర్లలో భయం పట్టుకుంది.

యాక్షన్‌ ధాన్యం రికవరీ వేగం..

2022–23 సీజన్‌లో ధాన్యం దిగుమతి చేసుకున్న 21మంది మిల్లర్లు సీఎంఆర్‌ పెట్టలేదు. ఆ ధాన్యం ప్రభుత్వం ఇతర వ్యాపారులకు వేలం ద్వారా కేటాయించింది. అయితే సంబంధిత మిల్లర్లు ధాన్యం ఇవ్వకుండా ఉన్నారు. ఇలా వీరి వద్ద నుంచి సుమారు రూ.80కోట్లు రావాల్సి ఉంది. అయితే ఇందులో ఐదు మిల్లుల యజమానులు ధాన్యం పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. పోగా మిగిలిన 16 రైస్‌ మిల్లు యజమానుల నుంచి రూ. 70కోట్ల విలువచేసే ధాన్యం ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో ధాన్యం పాడైందని, తరుగు పోను తగ్గించి ధాన్యం పెట్టేందుకు వెసులుబాటు ఇవ్వాలని మిల్లర్లు కోరినా అధికారులు తిరస్కరించినట్లు తెలిసింది. అదేవిధంగా మిల్లర్లు అడిగిన గడువు కూడా ముగియడంతో ఈ ధాన్యం రికవరీ కూడా అధి కారుల ముందు టార్గెట్‌గా నిలిచింది.

డిఫాల్ట్‌ మిల్లర్లపై ఆర్‌ఆర్‌ యాక్ట్‌కు సిద్ధం

సీఎంఆర్‌ బకాయిలు వసూలు చేయాలని అధికారులకు ఆదేశాలు

వారి ఆస్తులతోపాటు కుటుంబ సభ్యుల ఆస్తులపై ఆరా

ఇప్పటికే మిల్లర్లు బ్యాంకుల్లో

రుణాల స్వీకరణ

ప్రభుత్వ అప్పు.. బ్యాంకు అప్పు..

తీసుకున్న ధాన్యం మిల్లింగ్‌ చేసి బియ్యం పెట్టని మిల్లర్లపై ఆర్‌ఆర్‌ యాక్టు, ఇతర కేసులు పెట్టి రికవరీకి అధికారులు సిద్ధం అవుతున్నారు. మిల్లు యజమానుల ఆస్తులతోపాటు, వారి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు కూడా సేకరించడం మొదలు పెట్టారు. వందశాతం సీఎంఆర్‌ పెట్టకుండా, ధాన్యం నిల్వలు లేకుండా ఉన్న 25 రైస్‌ మిల్లుల నుంచి సుమారుగా రూ.100కోట్ల మేరకు ప్రభుత్వానికి రావాలి. ఇదిలా ఉండగా.. రైస్‌ మిల్‌ యజమానులు మిల్లు నిర్మాణం, మిషన్ల కొనుగోలు, ధాన్యం నిల్వలను చూపించి వివిధ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నారు. మిల్లర్లు తీసుకున్న అప్పులు సుమారు రూ.100కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందని అంచనా. అయితే ఇప్పుడు సివిల్‌ సప్లయీస్‌ అధికారులు ఆస్తుల జప్తునకు వెళ్తే.. బ్యాంకర్లు అడ్డువచ్చే అవకాశం ఉంది. బ్యాంకు, సివిల్‌ సప్లయీస్‌ శాఖ అధికారులు పోతే ఉన్న ఆస్తులు అప్పులకు సరిపోయే పరిస్థితి లేదు. మిల్లు యజమానులతోపాటు వారి కుటుంబ సభ్యుల్లో కొందరిపై కూడా హౌసింగ్‌, ఇండస్ట్రీ వంటి వ్యాపారాలపై అప్పులు తీసుకున్నవారే అధికంగా ఉన్నట్లు ప్రచారం. ఇటువంటి పరిస్థితిలో రికవరీ అధికారులకు సవాల్‌గా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement