పంటల అవశేషాలను కాల్చొద్దు | - | Sakshi
Sakshi News home page

పంటల అవశేషాలను కాల్చొద్దు

Nov 27 2026 12:56 AM | Updated on Nov 27 2026 12:56 AM

● డీఏఓ విజయచంద్ర

దంతాలపల్లి: రైతులు పంటల అవశేషాలను కాల్చొద్దని డీఏఓ విజయచంద్ర అన్నారు. మండలంలోని పెద్దముప్పారం గ్రామ రైతు వేదికలో గురువారం నిర్వహించిన ఖేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు అవసరానికి మించి రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని తెలిపారు. సేంద్రియ ఎరువులు వాడకం, పంట మార్పిడితో భూసారాన్ని పెంపొందించ్చుకోవచ్చన్నారు. యాసంగిలో వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. నేలకు ఉపయోగపడే స్మూక్షజీవులు, సహజ పోషకాలు, మిత్ర కీటకాలను కాపాడుకోవాలన్నారు. అనంతరం రైతులకు ఆరుతడి పంటల విత్తనాలు అందజేశారు. ఏఓ వాహిని, ఏఈఓ ఉదయ్‌కిరణ్‌, రైతులు పాల్గొన్నారు.

రికార్డులు మెయింటెన్‌ చేయాలి

చిన్నగూడూరు: ఎరువులు, పురుగుల మందుల రిటైల్‌ డీలర్లు కచ్చితంగా రికార్డులను మెయింటెన్‌ చేయాలని డీఏఓ విజయచంద్ర సూచించారు. గురువారం మండల కేంద్రంతో పాటు ఉగ్గంపల్లిలోని ఎరువుల, పురుగుల మందుల దుకాణా లను తనిఖీ చేశారు. స్టాక్‌ రిజిస్టర్‌, బిల్లు బుక్‌ రి కార్డుల్లో వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన ఎరువులు, పురుగు మందులకు సంబంధించిన బిల్లులను రైతులకు ఇవ్వాలని తెలిపారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి భాస్కర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement