రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

Nov 27 2026 12:56 AM | Updated on Nov 27 2026 12:56 AM

● కలెక్టర్‌ స్నేహశబరీష్‌

మహబూబాబాద్‌: రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ చర్యలు, ప్రమాద బాధితులకు సత్వర వైద్యసేవలు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతాయన్నారు. ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ముందస్తు నివారణ చర్యలు అత్యంత కీలకమన్నారు. రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే అంశాలను గుర్తించి పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. ఎస్పీ శబరీష్‌ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణలో పోలీస్‌శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటూ అవగాహన కల్పించాలన్నారు. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడపడం ప్రమాదకరం, అలాంటి అంశాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ పురుషోత్తం ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement