విద్యార్థులకు అసౌకర్యం కలిగితే చర్యలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు అసౌకర్యం కలిగితే చర్యలు

Oct 7 2026 1:28 AM | Updated on Oct 7 2026 1:28 AM

తొర్రూరు: విద్యార్థులకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అన్నారు. డివిజన్‌ కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ విద్యార్థులకు అందిస్తున్న యూనిఫామ్‌, నోట్‌ బుక్స్‌, తదితర అంశాలపై వివరంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతీ తరగతి గది, విద్యా బోధనను పరిశీలించారు. అనంతరం స్టోర్‌ గది, నిత్యావసర వస్తువుల నాణ్యత, గడువు తేదీలను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. డైట్‌ మెనూ తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థులకు వేడివేడి ఆహారం అందించాలని, వంటచేసే వారికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. నిరంతరం విద్యుత్‌, స్వచ్ఛమైన తాగు నీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల సంక్షేమశాఖ అధికారి నాగలక్ష్మి, ఆర్డీఓ గణేష్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గోన్నారు.

కలెక్టర్‌ స్నేహశబరీష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement