ఆస్తులు తీసుకొని.. తల్లిదండ్రుల పోషణ మరుస్తున్న కొడుకులు | - | Sakshi
Sakshi News home page

ఆస్తులు తీసుకొని.. తల్లిదండ్రుల పోషణ మరుస్తున్న కొడుకులు

Oct 7 2026 1:28 AM | Updated on Oct 7 2026 1:28 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

సాక్షి, మహబూబాబాద్‌: పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని నానుడి. అందుకోసమే ఎంత మంది ఆడపిల్లలు ఉన్నా.. వారసుడు కావాలని పూజలు చేస్తారు. అయితే గతంలో అదేస్థాయిలో తల్లిదండ్రులను పోషించే కుమారులు, అత్తామామలను తల్లిదండ్రులకంటే ప్రేమగా చూసుకునే కోడళ్లు ఉండేవారు. ప్రస్తుతం అత్తామామ సంపాదించిన ఆస్తులను తీసుకొని వృద్ధాప్యంలో తోడుగా ఉండాల్సిన వారే.. కొట్టి, తిట్టే ఇంటినుంచి గెంటేస్తున్న కుమారులు, కోడళ్లు ఉండడం గమనార్హం. ఇటువంటి సంఘటనలు జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్నాయి.

పెరుగుతున్న కేసులు..

తమ బిడ్డలు పోషించడం లేదని తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్న సంఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. ముగ్గురు కొడుకులు ఉన్నా.. పోషించడం లేదని ఒక వృద్ధ జంట గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. అదే విధంగా తమ భుక్తం కోసం ఇచ్చిన భూమిని చిన్నకొడుకు తన పేరున పట్టా చేయించుకున్నాడు. ప్రతీ నెల డబ్బులు ఇచ్చే ఇతర కుమారులు ఇది చూసి ఇవ్వడం లేదని, దీంతో తమ పోషణ ఇబ్బందిగా ఉందని మరో దంపతులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పది ఎకరాల భూమిని పట్టా చేశాను. కుమారుడి ఇద్దరు కూతుళ్ల వివాహం చేశాను. ఇప్పుడు ఇంటి నుంచి వెళ్లిపొమ్మని అంటున్నారని మరొక మహిళ ఫిర్యాదు చేసింది. కుమారుడి ఆరోగ్యం కోసం ఉన్న ఆరు ఎకరాల భూమిని అమ్మి వైద్యం చేయించాను. తన పేరున ఉన్న ఇల్లును కోడలు పేరున రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.. నేను ఎక్కడ ఉండాలని మరొకరు.. ఇలా ఇటీవల కాలంలో కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదులు చేసిన వారు ఉన్నారు. అదే విధంగా ఇంటిగుట్టు బయట పెడితే సమాజంలో కుమారుల పరువు పోతుందని, కష్టమైనా.. నష్టమైనా.. భరించాల్సిందే అంటూ కుమిలిపోయి చనిపోయిన వారు కూడా ఉండడం గమనార్హం.

ఏడాదిలో

జిల్లాలో నమోదైన కేసుల వివరాలు

మహబూబాబాద్‌ 34 19 15

మొత్తం

62 35

27

తొర్రూరు

28 16

12

తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్లో అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ల మధ్య పంచాయితీ ఉండడంతోనే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు. కుమారులకు ఆస్తుల పంపకాలు సరిగా చేయకపోవడం, కూతుళ్ల పేరున భూమి రిజిస్ట్రేషన్‌ చేయించడం, వృద్ధులకు భుక్తంగా ఇచ్చిన భూమిని కూడా పంచి ఇవ్వాలని ఒత్తిడి చేయడం, లేదా ఒకరి పేరునే రిజిస్ట్రేషన్‌ చేయించిన సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పదవీ విరమణ పొందిన వారు, ఆస్తులు అమ్ముకోగా వచ్చిన డబ్బుల పంపిణీలో.. కుమారులకు, కూతుళ్లకు పంచి ఇచ్చే సందర్భంలో చోటు చేసుకున్న గొడవలు వృద్ధులను బజారులో పడవేయడం, లేదా వృద్ధాశ్రమాల్లో వేయడం వంటి సంఘటనలు ఉన్నాయి.

ఆస్తులకోసమే..

వృద్ధాప్యంలో పండుటాకుల పాట్లు

ప్రజావాణికి వచ్చి గోడు వినిపిస్తున్న వృద్ధులు

తల్లిదండ్రులను పోషించడం బాధ్యత

ఆస్తులు, డబ్బులతో సంబంధం లేకుండా జన్మనిచ్చిన తల్లిదండ్రులను పోషించడం బాధ్యత. అయితే ఆస్తులు, డబ్బులు పంచుకొని తల్లిదండ్రులను పట్టించుకోని వారు ఉన్నారు. అదే విధంగా ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు, సమాజంలోని ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా తల్లిదండ్రుల పోషణలో వెనకాడడం విచారకరం. తల్లిదండ్రుల పోషణలో నిర్లక్ష్యం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు వెనకాడేది లేదు. ఆర్డీఓ పరిధిలో ఈ కేసులు వస్తాయి. అక్కడ న్యాయం జరుగుతుంది. – అనిల్‌ కుమార్‌, అదనపు కలెక్టర్‌(రెవెన్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement