జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలి

Oct 7 2026 1:28 AM | Updated on Oct 7 2026 1:28 AM

మహబూబాబాద్‌: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని కాంగ్రెస్‌, వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోత్‌ జ్యోతి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్‌, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్‌సారథి రెడ్డి, నాయకులు మండల వెంకన్న, చిన్న చంద్రన్న మాట్లాడారు. జ్ఞానేశ్‌కుమార్‌ను తొలిగించేంత వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. వెంటనే సర్‌ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. దేశంలో 13కోట్ల మంది ఓట్లను తొలగించి మళ్లీ అఽధికారంలోకి రావడం కోసం బీజేపీ సర్‌ పేరుతో కుట్ర చేస్తుందని ఆరోపించారు. సర్‌తోనే బీజేపీ పతనం ప్రారంభమైందని, ప్రజలు ఓటు రూపంలో తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సూర్నపు సోమయ్య, నాయకులు పెరుగు కుమార్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, కొత్తపల్లి రవి, లింగ్యా, సీతారాం, రాజమౌళి, ప్రసాద్‌, రాజు, సాంబలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌, వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement