● ఇన్‌చార్జ్ డీఈఓ శ్రీరాములు
కురవి: మూల్యాంకన ప్రక్రియలో నిబంధనలు, మార్గదర్శకాలు పాటిస్తూ పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని, మూల్యాంకనం నిష్పక్షపాతంగా జరగాలని ఇన్‌చార్జ్ డీఈఓ మందుల శ్రీరాములు సూచించారు. మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూ ల్‌లో 6, 9వ తరగతి విద్యార్థుల ఎక్స్‌టర్నల్ ఎవల్యూషన్ సెంటర్‌ను మంగళవారం పరిశీ లించారు. మూల్యాంకన ప్రక్రియకు సంబంధించిన రికార్డులు, విద్యార్థుల హాజరు, మూల్యాంకన విధానం, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, తదితర సౌకర్యాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభను సరైన రీతిలో అంచనా వేసేలా మూల్యాంకనం సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో సెంటర్ ఇన్‌చార్జ్ శ్రీధర్, అప్పారావు పాల్గొన్నారు.
బాహ్య మూల్యాంకనం సరికొత్త విధానం
నెల్లికుదురు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 6, 9వ తరగతి సమ్మెటివ్ అసెస్‌మెంట్–1 విద్యార్థుల జవాబు పత్రాల బాహ్య మూల్యాంకనం సరికొత్త విధానమని ఇన్‌చార్జ్ డీఈఓ మందుల శ్రీరాములు, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రాధమిక పాఠశాలలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న జవాబు పత్రాల బాహ్య మూల్యాంకనం కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా విద్యాశాఖ బృందం సందర్శించి పరిశీలించింది. కార్యక్రమంలో ఎవల్యూషన్ సెంటర్ ఇన్‌చార్జ్ కరుణాకర్, ఫనిద్రా, హెచ్‌ఎం విజయలక్ష్మి, మండల ఎంఐఎస్ కోఆర్డినేటర్ మష్కపురి సుధాకర్, ఆపరేటర్ ఉపేందర్ పాల్గొన్నారు.


