అర్హత లేని వ్యక్తులు వైద్యం చేస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

అర్హత లేని వ్యక్తులు వైద్యం చేస్తే చర్యలు

Oct 7 2026 1:28 AM | Updated on Oct 7 2026 1:28 AM

గార్ల: అర్హత లేనివారు వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ అన్నారు. గార్ల పట్టణ కేంద్రంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుపుతున్న ప్రైవేట్‌ క్లీనిక్‌లు, ల్యాబ్‌లపై మంగళవారం డీఎంహెచ్‌ఓ ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అర్హత లేకుండా నిర్వహిస్తున్న అశోక్‌ క్లీనిక్‌ను సీజ్‌ చేశారు. అర్హత లేని వ్యక్తులు వైద్యం అందించడం చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంజక్షన్లు వంటి వైద్య ప్రక్రియను నిర్వహించొద్దని హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన సురక్షితమైన వైద్యసేవలు అందేలా జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రులు, క్లీనిక్‌లు, ల్యాబొరేటరీలపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. డాక్టర్లు విరాజిత, శివకుమార్‌, సీహెచ్‌ఓ జ్ఞానసుందరి, జూనియర్‌ అసిస్టెంట్‌ రాకేశ్‌ పాల్గొన్నారు.

ముల్కనూరు పీహెచ్‌సీ

ఆకస్మిక తనిఖీ..

మండలంలోని ముల్క నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత వైద్యసిబ్బంది హాజరు పట్టిక, వ్యాక్సినేషన్‌ రికార్డులను పరిశీలించారు. వైద్యులు, వైద్యసిబ్బంది విధుల్లో సమయపాలన పాటిస్తూ, ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌ శివకుమార్‌, డాక్టర్‌ విరాజిత, పీహెచ్‌సీ డాక్టర్‌ హనుమంతరావు, డీపీహెచ్‌ఎన్‌ సక్కుబాయి, డాక్టర్‌ నవీన్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement