పెద్దవంగర: రైతుల పంటలకు నిరంతర విద్యుత్ సరఫరాకు కృషి చేస్తామని టీజీ ఎన్పీడీసీఎల్ సీఈ గౌతమ్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వడ్డెకొత్తపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా పరిస్థితిని పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. అధిక లోడ్‌తో పని చేస్తున్న ట్రాన్స్‌ఫార్మర్లను, సబ్ స్టేషన్లు, 11 కేవీ ఫీడర్లను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులకు సూచించారు. రానున్న రోజుల్లో విద్యుత్ డిమా ండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలతో వ్యవహరించాలని సూచించారు. తొర్రూరు డీఈ కృష్ణ, ఏఈ రమేష్ బాబు ఉన్నారు.
సబ్‌స్టేషన్ తనిఖీ
నర్సింహులపేట: మండలంలోని పెద్దనాగారం 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను మంగళవారం విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ గౌతమ్‌రెడ్డి ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. రైతులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎస్‌ఈ దర్శన్ కుమార్, డీఈ కృష్ణ, ఏడీఈ శ్రీనివాస్, ఏఈ సుమన్ తదితరులు పాల్గొన్నారు.


