కేయూ పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్ష వాయిదా | - | Sakshi
Sakshi News home page

కేయూ పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్ష వాయిదా

Oct 7 2026 1:28 AM | Updated on Oct 7 2026 1:28 AM

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో దూరవిద్య కేంద్రం పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే, ఈనెల 9న నిర్వహించాల్సిన పరీక్షను వాయిదావేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్‌ తెలిపారు. వాయిదాపడిన పరీక్షను ఈనెల 10న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మిగతా పేపర్ల పరీక్షలు టైంటేబుల్‌ ప్రకారం య థావిఽధిగా జరుగుతాయని తెలిపారు. విద్యార్థులు ఈమార్పును గమనించి తదనుగుణంగా పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.

బీఫార్మసీ పరీక్షల్లో ఏడుగురు విద్యార్థుల డీబార్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీఫార్మసీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం నగరంలోని పలు కేంద్రాలను పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ తనిఖీ చేశారు. శివానీ ఫార్మసీ కళాశాలలో కాపీయింగ్‌ చేస్తూ ఆరుగురు విద్యార్థులు, కేర్‌ ఫార్మసీ కళాశాలలో కాపీయింగ్‌ చేస్తూ ఒకరు మొత్తం ఏడుగురు పట్టుబడగా వారిని డీబార్‌ చేసినట్లు రాజేందర్‌ తెలిపారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థులపై నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని వివరించారు.

‘సూపర్‌’ పనులు

పర్యవేక్షించిన డీఎంఈ

కాశిబుగ్గ: వరంగల్‌లో చేపట్టిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను డీఎంఈ వాణి పర్యవేక్షించారు. మంగళవారం నేరుగా ఆమె స్పెషల్‌ ఆఫీసర్లతో కలిసి ఆస్పత్రికి చేరుకుని నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. పలు ఫ్లోర్లలో జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించి, అధికారులకు సూచనలు అందజేశారు. అలాగే, పలు విభాగాలకు చెందిన హెచ్‌ఓడీలతో రాత్రి వరకు సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. సూపర్‌ పనులను త్వరగా పూర్తి చేస్తేనే ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్‌తో పాటు ముగ్గురు నోడల్‌ ఆఫీసర్ల పర్యవేక్షణతో జరుగుతున్న పనుల తీరును నిశ్చితంగా పరిశీలించారు. దసరా పండుగ లోపు కనీసం ఓపీ సేవలను అందుబాటులో తీసుకొచ్చే ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో వైద్యాధికారులు ముందుకెళ్తున్నారు.

త్వరలోనే స్వదేశానికి సుప్రియ మృతదేహం

● రఘురాంరెడ్డి లేఖతో కదిలిన

అమెరికా కాన్సులేట్‌

ఖమ్మంరూరల్‌: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి సింహాద్రినగర్‌కు చెందిన కొదుమూరు సుప్రియ మృతి చెందగా, ఆమె మృతదేహాన్ని స్వదేశానికి రప్పించే చర్యలు వేగిరమయ్యాయి. ఈమేరకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి రాసిన లేఖతో స్పందించిన అమెరికాలోని భారత కాన్సులేట్‌ అధికారులు మృతదేహాన్ని త్వరగా పంపించేందుకు సహకరిస్తామని వెల్లడించారు. ప్రస్తు తం ఢిల్లీలో ఉన్న ఎంపీ అక్కడి నుంచి ఎంబసీ అధి కారులతో సంప్రదిస్తున్నారు. ఇప్పటికే సుప్రియ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిందని అమెరి కాలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ ఎం.ఆనంద్‌ ప్రకాశ్‌ వెల్లడించగా, ఎంబామింగ్‌ అనంతరం రెండు రోజుల్లో మృతదేహాన్ని అప్పగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనంతరం భారత్‌కు తరలించేందుకు కాన్సులేట్‌ అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. కాగా, సుప్రియ భర్త కొదుమూరు రంజిత్‌తో కాన్సులేట్‌ జనరల్‌ సమన్వయం చేస్తున్నారని ఎంపీ ఒక ప్రకటనలో తెలిపారు.

చిన్నారిపై బాలుడి

లైంగిక దాడి

● చెన్నారావుపేట మండలంలో ఘటన

చెన్నారావుపేట: ఓ చిన్నారిపై బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలానికి చెందిన 4 సంవత్సరాల చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటోంది. ఈ సమయంలో ఓ బాలుడు వచ్చి ఆడుకుందామని చెప్పి ఓ భవనంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో తెలి యక భయంతో చిన్నారి ఏడుస్తూ కేకలు వేయడంతో బంధువులు చూశారు. ఏం జరిగిందని అడగడంతో విషయం చెప్పింది. దీంతో వెంటనే ఆ చిన్నా రి కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందజేయగా వారు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం చిన్నారి బంధువుల ఫిర్యాదు మేరకు బా లుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేశ్‌ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement