గుడుంబా స్థావరాలపై దాడులు | - | Sakshi
Sakshi News home page

గుడుంబా స్థావరాలపై దాడులు

Oct 4 2026 10:13 AM | Updated on Oct 4 2026 10:13 AM

గుడుంబా స్థావరాలపై దాడులు

బయ్యారం: మండలంలోని జగ్నాతండాలో శనివారం పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. తండాలో ఇంటింటి సోదాలు నిర్వహించి అనుమానితుల వివరాలు తెలుసుకున్నారు. పలువురి ఇళ్లలో 6లీటర్ల నాటుసారా, 200లీటర్ల బెల్లంపానకంను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గార్ల–బయ్యారం సీఐ లోడిగ రవీందర్‌ తండావాసులను ఉద్దేశించి మాట్లాడారు. నాటుసారా తయారీ, రవాణా చేయడం, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను వినియోగించటం వంటి చట్టవిరుద్ధమైన, ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. జగ్నాతండాలో నాటుసారా తయారీ చేస్తున్న కాశీరాం, హచ్యాపై కేసు నమోదు చేసినట్ల తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు ప్రశాంత్‌బాబు, సాయికుమార్‌తోపాటు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

తయారీదారుల బైండోవర్‌

తొర్రూరు: గుడుంబా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎకై ్సజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎకై ్సజ్‌ సీఐ బూస అశోక్‌ తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని దుబ్బతండా శివారులో ఎకై ్సజ్‌ శాఖ ఆధ్వర్యంలో శనివారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఆటోను సోదా చేయగా 10లీటర్ల గుడుంబా లభ్యమైంది. రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేశారు. తనిఖీల్లో ఎస్సై శంకర్‌ పాల్గొన్నారు.

గుడుంబా పట్టివేత

డోర్నకల్‌: మండలంలోని కస్నాతండా, గన్యాతండాలో శనివారం డోర్నకల్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించి గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఝాన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. గుగులోత్‌ భద్రమ్మ వద్ద 8లీటర్లు, బానోత్‌ బుజ్జమ్మ వద్ద 6లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

నాటుసారా విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

కురవి: నాటుసారా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై సతీష్‌ శనివారం తెలిపారు. బలపాల శివారు లింగ్యాతండాలో కురవి రెండో ఎస్సై జయకుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేసినట్లు తెలిపారు. తండాకు చెందిన జెరుపుల శంకర్‌ అనే వ్యక్తి రూ.3200 విలువైన 8లీటర్ల నాటుసారాను, అదే తండాకు చెందిన మాలోత్‌ జగ్న అనే వ్యక్తి రూ.2వేల విలువైన ఐదు లీటర్ల నాటు సారా విక్రయిస్తుండగా పట్టుకుని సీజ్‌ చేసినట్లు ఎస్సై సతీష్‌ తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement