రూ.2.47 కోట్ల విలువైన సీఎంఆర్‌ ధాన్యం స్వాహా | - | Sakshi
Sakshi News home page

రూ.2.47 కోట్ల విలువైన సీఎంఆర్‌ ధాన్యం స్వాహా

Oct 3 2026 1:20 AM | Updated on Oct 3 2026 1:20 AM

ఐదుగురిపై కేసు నమోదు

తొర్రూరు: పౌర సరఫరాల సంస్థకు అప్పగించాల్సిన బియ్యాన్ని స్థానిక మిల్లర్లు స్వాహా చేశారు. తొర్రూరు పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కృష్ణకిషోర్‌ వివరాలు వెల్లడించారు. మండలంలోని మాటేడు గ్రామం వెంకటేశ్వర బిన్నీ రైస్‌ మిల్లుకు 2022–23 యాసంగి సీజన్‌లో అప్పగించిన 1101 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ బి య్యాన్ని పక్కదారి పట్టించారు. ఇటీవల పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్‌ అధికారులు మిల్లులో తనిఖీ నిర్వహించగా ధాన్యం లేకపోవడాన్ని గుర్తించారు. దాని విలువ రూ.2.47 కోట్లు ఉంటుందని తేల్చారు. పక్కదారి పట్టిన ధాన్యాన్ని తిరిగి ఇవ్వాలని, లేని పక్షంలో అందుకు సమానమైన విలువతో కూడిన డబ్బులు చెల్లించాలని మిల్లు యజమానులను అధికారులు హెచ్చరించారు. ఆదేశాలు బేఖాతరు చేయడంతో అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మిల్లు యజమాని బొల్లం వెంకన్నతో పాటు భాగస్వాములైన బొల్లం కొమురెల్లి, మహంకాళి రమేష్‌, తాటికొండ వెంకన్న, ఎక్క టి కృష్ణారెడ్డిని రిమాండ్‌కు తరలించారు. సీఐ గణేష్‌, ఎస్సై మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

అధికారుల పేర్లతో ఫేక్‌ కాల్స్‌

కేసముద్రం: మున్సిపల్‌ కమిషనర్‌, పుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ పేర్లతో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చే స్తూ.. తమకు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాలంటూ పలువురిని బురిడికొట్టించే ప్రయత్నం చే సిన సంఘటన కేసముద్రం మున్సిపాలిటీ పరి ధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. తాను మున్సిపల్‌ కమిషనర్‌ ను మాట్లాడుతున్నానంటూ ఓ గుర్తుతెలియని వ్యక్తి, పలువురు వ్యక్తులకు ఫోన్‌ చేసి, ట్రేడ్‌ లైసెన్స్‌ తదితర విషయాలను ప్రస్తావిస్తూ, ఆన్‌లైన్‌లో డబ్బులను చెల్లించాలంటూ కోరాడు. దీంతో అనుమానం వచ్చిన కొందరు వ్యక్తులు, మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయాన్ని సంప్రదించగా.. వారికి వచ్చినవి ఫేక్‌ కాల్స్‌ అని తేలింది. అదే విధంగా పలు హోటల్‌ యజమానులకు తాను ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ను మాట్లాడుతున్నానంటూ ఫోన్‌ చేసి డబ్బులు ఆన్‌లైన్‌లో చెల్లించాలని, లేదంటే చర్యలు ఉంటాయని హెచ్చరించాడు. ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ఫేక్‌ కాల్స్‌పై పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కమిషనర్‌ కార్యాలయం పేరుపై ఎలాంటి కాల్స్‌ వచ్చిన తమను సంప్రదించాలని సూచించారు. ఫేక్‌ కాల్స్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కమిషనర్‌ తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌లో పీహెచ్‌డీ, విశ్వేశ్వరయ్య పీడీఎఫ్‌ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శుక్రవారం నిట్‌ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. పీహెచ్‌డీకి బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకామ్‌, బ్యాచ్‌లర్స్‌ డిగ్రీ, ఎంబీఏ విద్యార్థులు అర్హులుగా పేర్కొంది. ఫుల్‌టైం, పార్ట్‌టైమ్‌, ఎగ్జిక్యూటివ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రాంకుగాను ఈనెల 14 వరకు దరఖాస్తుకు చివరి తేదీగా తెలిపింది. విశ్వేశ్వరయ్య పీడీఎఫ్‌కు పీహెచ్‌డీ డిగ్రీ లేదా పీహెచ్‌డీ థీసిస్‌ విద్యార్థులు అర్హులుగా, ఈనెల 12వ తేదీ దరఖాస్తుకు చివరి తేదీగా నిట్‌ యాజమాన్యం నిర్ణయించింది. admissions.nitc.ac.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement