మహబూబాబాద్: రోడ్లపై అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని మున్సిపల్ కమిషనర్ వినోద్‌కుమార్ హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని వివేకానంద సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం రోడ్డు వరకు ఆక్రణ నిర్మాణాలను మున్సిపల్ సిబ్బంది పొక్లెయినర్‌తో తొలగించారు. ఈసందర్భంగా కమిషనర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. రోడ్లపై ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు, బోర్డులు, వ్యాపార సామగ్రిని తొలగించామన్నారు. వ్యాపారులు వారి స్థలాల్లోనే సర్దుబాటు చేసుకోవాలన్నారు. అక్రమ నిర్మాణాలతో సమస్యలు జఠిలమవుతున్నాయని, వ్యాపారులు అర్థం చేసుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీపీఓ సాయిరాం, టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, టీపీఎస్ వెంకటరమణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ మున్సిపల్ సిబ్బంది శ్రీకాంత్, పుష్పరాజ్, తల్లు, శ్రీనివాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


