పాము కాటు.. కుటుంబాలకు చేటు | - | Sakshi
Sakshi News home page

పాము కాటు.. కుటుంబాలకు చేటు

Jul 3 2026 12:58 AM | Updated on Jul 3 2026 12:58 AM

నర్సంపేట: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఒక వైపు సీజనల్‌ వ్యాధులు. మరో వైపు పాములు, తేళ్లు, విష పురుగుల కాటులతో పలు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వీటి బారిన పడుతున్నారు. అప్పటి వరకు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నుంచి ప్రధానంగా పాము కాటు వేస్తే ప్రాణాలు పోవడంతోపాటు అనారోగ్యానికి గురవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా చిన్నాభిన్నమవుతోంది. ఇంటి పరిసరాలు చెట్లతో కూడి ఉండడంతో పాములు వాటి కింద ఉంటూ ఆ వైపు వెళ్లిన వారిని కాటు వేయడం, చేలల్లో పనుల సమయంలో కాటు వేస్తున్నాయి. ప్రధానంగా వరంగల్‌ జిల్లాలోని అటవీ ప్రాంత గ్రామాల్లో పాములు అత్యధికంగా సంచరిస్తుంటాయి.

ఇలా చేస్తే కొంత నయం..

● పాము కాటుకు గురి కాకుండా ఇంటి పరిసరాల్లో పొదలు లేకుండా చూసుకోవడంతో పాటు రాత్రి వేళల్లో ఆరుబయట నిద్రించకుండా ఉండడం మేలు.

● రైతులు మార్కెట్‌లో లభిస్తున్న కాళ్ల బూట్లు ధరిస్తూ చేతి కర్రతో పంట పొలాల్లో వెళ్తే ఎంతో మేలు.

● పాము కాటు వేసిన అరగంట సమయంలో అందుబాటులో ఉన్న ఆస్పత్రికి వెళ్తే పెద్ద ప్రమాదం ఉండని పరిస్థితి ఉంటుంది.

రోజురోజుకూ పెరుగుతున్న పాము, తేలు కాటు బాధితుల సంఖ్య

వరంగల్‌ జిల్లాలో పాము, తేలు కాటుకు గురైన వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జిల్లాలోని గ్రామాలు 80శాతం అటవీ ప్రాంతాలతో కూడి ఉండడంతో పాములకు ఆవాసాలుగా నిలిచాయి. జిల్లా ఆస్పత్రిగా పేరొందిన నర్సంపేట ప్రభుత్వ దవాఖానాలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు 126 మంది పాము కాటుకు, 84మంది తేటు కాలు కాటుకు గురై వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇవే కాకుండా మిగతా ఆస్పత్రులలో చికిత్స పొంది ఉంటారు.

ఆరు నెలల్లో 126 మందిని

కరిచిన పాములు

చనిపోయిన వారి కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం

ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధితుల వేడుకోలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement