బంగారం దొరికిన ఘటనలో కూలీల విచారణ | - | Sakshi
Sakshi News home page

బంగారం దొరికిన ఘటనలో కూలీల విచారణ

Jul 3 2026 12:58 AM | Updated on Jul 3 2026 12:58 AM

వస్తువులు స్వాఽధీనం చేసుకున్న తహసీల్దార్‌

చెన్నారావుపేట: వరంగల్‌జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని కోపాకుల పాడు వ్యవసాయ భూముల్లో కౌలు రైతులు, కూలీలకు బంగారం దొ రికిందన్న చర్చ వారం రోజులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై తహసీల్దార్‌ గత మంగళవారం( గత నెల 30వ తేదీ) ఘటనాస్థలికి చేరుకుని పరిసరాలు పరిశీలించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు గురువారం ఆ వ్యవసాయ భూమిలో గత శుక్రవారం(గత నెల 26వ తేదీ) పనులకు వెళ్లిన కూలీలు, భూమి కౌలుకు చేస్తున్న రైతును తహసీల్‌ కార్యాలయానికి పిలిచారు. తహసీల్దార్‌ అబీద్‌అలీ సమక్షంలో ఎస్సై రాజేశ్‌ రెడ్డి ఆ కూలీల నుంచి వాగ్మూలం సేకరించారు. ఆ రోజు ఎంత మంది పనికి వెళ్లారు? ఎవరెవరికి బంగారం దొరికింది? ఏఏ వస్తువులు దొరికాయి? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నివేదికను కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు అధికారులు తెలిపారు.

బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్న

తహసీల్దార్‌ ..

విచారణ అనంతరం కూలీల నుంచి బంగారు వస్తువులు పుస్తె, హారంలో నిధిగా భావిస్తున్న బిల్ల, గుండు, రేకు వస్తువులను తహసీల్దార్‌ అబీద్‌అలీ స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement