నేడు ఓరుగల్లు పీఠకాపరిగా విజయపాల్‌రెడ్డికి పట్టాభిషేకం | - | Sakshi
Sakshi News home page

నేడు ఓరుగల్లు పీఠకాపరిగా విజయపాల్‌రెడ్డికి పట్టాభిషేకం

Jul 3 2026 12:58 AM | Updated on Jul 3 2026 12:58 AM

కాజీపేట రూరల్‌ : కాజీపేట ఫాతిమానగర్‌ కేథిడ్రల్‌ క్యాంపస్‌లో రోమ్‌ 14వ పోప్‌లియో నియమించిన ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన దుగ్గింపుడి విజయపాల్‌రెడ్డికి శుక్రవారం ఓరుగల్లు మేత్రాసనం 4వ పీఠకాపరిగా పట్టాభిషేకం జరగనుందని మీడియా ఇన్‌చార్జ్‌ ఫాదర్‌ ఎం.జయపాల్‌ గురువారం తెలిపారు. ఉదయం 9: 00 గంటలకు ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రోమ్‌ పోప్‌లియో దూత, అగ్రపీఠాధిపతులు, ఫాదర్లు, మఠాధిపతులు, మఠకన్యలు, ప్రజాప్రతినిధులు, అధికారులు.. విజయపాల్‌రెడ్డిని పీఠకాపరిగా అభిషేకిస్తారని చెప్పారు. పట్టాభిషేకానికి తరలొచ్చే వారి కోసం ఫాతిమానగర్‌ కేథిడ్రల్‌ చర్చి ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

నూతన బిషప్స్‌ హౌస్‌ ప్రారంభం..

ఫాతిమానగర్‌ కేథిడ్రల్‌ క్యాంపస్‌ ప్రాంగణంలో ఓరుగల్లు మేత్రాసనం పరిపాలనా సౌలభ్యం కోసం అత్యాధునిక హంగులతో నిర్మించిన నూతన బిషప్స్‌ హౌస్‌ను ప్రారంభించనున్నట్లు మీడియా ఇన్‌చార్జ్‌ ఎం.జయపాల్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement