మా అవ్వ చంద్రమ్మ సంక్రాంతి రోజున పరమాన్నం వండి దేవుళ్లకు నైవేద్యంగా సమర్పించింది. పూజా కార్యక్రమాలు ముగిశాక చాపపై నిద్రించింది. కొద్ది సేపటికే ఏదో కరిచినట్లు అనిపించడంతో మాకు చెప్పింది. ఇల్లంతా వెతికినా ఏమీ కనిపించలేదు. పు రుగు కుట్టి ఉంటుందనుకుని పెద్దగా పట్టించుకోలేదు. కానీ గంట తర్వాత ఇంట్లో పాము కనిపించింది. అప్పటికే విషం మా అవ్వ శరీరమంతా వ్యాపించి అస్వస్థతకు గురైంది. వెంటనే అంబులెన్స్‌లో ఆస్పతికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. పండుగ రోజు మా ఇంట్లో తీరని విషాదం అలుముకుంది.
–బల్ల రాజు, రేలకుంట, నల్లబెల్లి మండలం


