నియామకానికి ఇంటర్వ్యూలు | - | Sakshi
Sakshi News home page

నియామకానికి ఇంటర్వ్యూలు

Jul 3 2026 12:58 AM | Updated on Jul 3 2026 12:58 AM

269 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు..

నేటి నుంచి పార్ట్‌టైం అధ్యాపకుల

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో పార్ట్‌టైం అధ్యాపకుల నియామకానికి ఈనెల 3(శుక్రవారం) నుంచి 8వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి –మార్చిలో 20 విభాగాల్లో 99 మంది పార్ట్‌టైం అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరించారు. 601 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలుత 16 విభాగాల్లో 69 మంది అధ్యాపకుల నియామకానికి ఈనెల 3 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు రోస్టర్‌ ప్రకారం షార్ట్‌లిస్టు చేసి కొందరికే ఫోన్‌ద్వారా సమాచారం అందించారు.

విభాగాల వారీగా ఇంటర్వ్యూల తేదీలు..

జూలై 3న ‘లా’, సోషియాలజీ, లైబ్రరీ సైన్స్‌, సైకాలజీ అభ్యర్థులకు, 4న కంప్యూటర్‌ సైన్స్‌, ఫిజిక్స్‌, కామర్స్‌, 6న బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, 7న బాటనీ, జువాలజీ, తెలుగు, 8న పొలిటికల్‌ సైన్స్‌, ఇంగ్లిష్‌, మ్యాథ్‌మెటిక్స్‌, ఫార్మసీ విభాగాల అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచినట్లు రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం తెలిపారు.

వంద మార్కులు..

ఆయా విభాగాల్లో పార్ట్‌టైం అధ్యాపకుల నియామకానికి వంద మార్కులు కేటాయించారు. అభ్యర్థులకు యూజీ, పీజీ, పీహెచ్‌డీ, నెట్‌,సెట్‌, పబ్లికేషన్స్‌, టీచింగ్‌ అనుభవానికి సంబంధించి 80 మార్కుల వరకు కేటాయించారు.10 మార్కులు డెమోన్‌స్ట్రేషన్‌,10 మార్కులు ఇంటర్వ్యూలకు కేటాయించారు.

ఈ విభాగాలకు తర్వాతే..

కేయూలోని మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్‌, జియాలజీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగాలకు దరఖాస్తులు స్వీకరించినా ప్రస్తుతం ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదు. తర్వాత నిర్వహిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.

269 మంది అభ్యర్థులకు పిలుపు

16 విభాగాల్లో 69 మందిని ఎంపిక చేయనున్న అధికారులు

ఆయా విభాగాలన్నీ కలిపి దరఖాస్తులు చేసిన అభ్యర్థుల్లో షార్ట్‌ లిస్టుగా రూపొందించి 269 మంది అభ్యర్థులను డెమో, ఇంటర్వ్యూలకు పిలిచారు. ఇందులో 69 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. కాగా, 248 మంది అభ్యర్థుల దరఖాస్తులను రిజెక్ట్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement