హన్మకొండ చౌరస్తా: జాతీయ స్థాయి ఆర్ట్ చాలెంజ్ శుక్రవారం నుంచి 14 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు సాగంటి మంజుల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ చిత్రకారుడు శేష బ్రహ్మం కళా యజ్ఞ స్ఫూర్తితో ‘కళాయజ్ఞ మినీ’ అనే పేరుతో జాతీయ స్థాయిలో 7 అంశాలపై ఆర్ట్ చాలెంజ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే వారికి ప్రతీ రెండు రోజులకు ఓ సారి ఒక సరికొత్త అంశం ఇవ్వనున్నట్లు తెలిపారు. అందులో అద్భుత ప్రతిభ కనబరిచిన చిత్రకారుల చిత్రాలను హైదరాబాద్‌లో ఆగస్టులో జరిగే చిత్ర కళా ప్రదర్శనలో ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఇందులో 50 మంది ప్రముఖ చిత్రకారులు పాల్గొంటున్నారని, వారు వేసిన పెయింటింగ్స్ సైతం పొందుపరచనున్నట్లు తెలిపారు. ఇతర పూర్తి వివరాలకు 81436 43337 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని..
● మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
భూపాలపల్లి రూరల్: ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన భూపాలపల్లి మండలం వజినపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండి సునీల్ (26) బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నా రాకపోవడంతో కొంతకాలంగా మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేశ్‌కుమార్ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో
తాపీమేసీ్త్ర మృతి
గూడూరు: అనుమానాస్పద స్థి తిలో ఓ తాపీమేసీ్త్ర మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని గొల్లగూడెం బీరన్న గుడి ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని చెంద్రుగూడేనికి చెందిన తాపీ మేసీ్త్ర ఎం.డీ హుస్సేన్ (46) బుధవారం సాయంత్రం వారాంతపు సంతలో కూరగాయలు తీసుకొస్తానని బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాలేదు. దీంతో భార్య సైదాబి గురువారం తెల్లవారుజామున తన భర్త ఇంటికి రాలేదని బంధువులకు చెప్పడంతో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో గొల్లెగూడెం సమీప బీరన్న గుడి పక్కన బహిర్భూమికి వెళ్లిన స్థితిలో వాంతులు చేసుకున్నట్లు, చెవులు, నోటి ద్వారా రక్తం కనిపించి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఏదైనా విష పురుగు కుట్టి చనిపోయాడా? లేదా ఇతర మరేదైనా ప్రమాదంతో మృతి చెందాడా అనే అంశంపై మృతుడి భార్య సైదాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపారు.


