● కాల్వలో పడి యువకుడి మృతి
● గుండేడు శివారులో ఘటన
కమలాపూర్: బైక్ అదుపు తప్పి కాల్వలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుండేడుకు చెందిన దాసి వెంకటేష్ (27) తన తండ్రి సాంబయ్యతో కలిసి జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ దర్గాను దర్శించుకుని అక్కడి నుంచి బైక్‌పై గుండేడుకు వస్తున్నాడు. మార్గమధ్యలో తన తండ్రిని దింపి ఒంటరిగా వస్తున్నాడు. ఈ క్రమంలో గుండేడు శివారులో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కెనాల్‌లో పడింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ నవీన్ తెలిపారు.
ప్రేమ వివాహం చేసుకుందని..
హసన్‌పర్తి : చెల్లి ప్రేమ వివాహం చేసుకుందనే ఆ గ్రహంతో అబ్బాయిని చంపుతామని బెదిరించడమే కాకుండా అతడి ఇంటికి నిప్పు అంటించారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి గురువారం నిందితులను అరెస్ట్ చేసి రి మాండ్‌కు తరలించినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ తెలిపారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ కథనం ప్రకారం.. హసన్‌పర్తి మండలం పెంబర్తికి చెందిన సౌరం విష్ణువర్ధన్, గుండ్లసింగారానికి చెందిన గాదె కరిష్మా గత నెల 24న ఓ ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహాన్ని పెద్దలు అంగీకరించలేదు. చెల్లి ప్రేమ వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న అమ్మాయి సోదరుడు గాదె పాల్.. తన స్నేహితుడు మహబూబాబాద్ జిల్లా పూరి తండాకు చెందిన గుగులోత్ మనోజ్‌తో కలిసి జూన్ 24న కత్తులతో దాడికి చేయడానికి విష్ణు వర్ధన్ ఇంటికి వచ్చారు. ఆ తర్వాత మర్నాడు తెల్ల వారుజామున బాధితుడి ఇంటికి నిప్పు అంటించారు. దీంతో ఇంట్లో ఉన్న వారు తృటిలో ప్రాణాలతో తిప్పించుకున్నారు. నిందితుల నుంచి తల్వార్, కత్తిపాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ తెలిపారు.
● అబ్బాయి ఇంటికి నిప్పు..ఆపై బెదిరింపు
● నిందితుల అరెస్ట్..
వివరాలు వెల్లడించిన పోలీసులు


