పాస్‌పుస్తకమున్నా బెదిరింపులు.. | - | Sakshi
Sakshi News home page

పాస్‌పుస్తకమున్నా బెదిరింపులు..

Jul 3 2026 12:58 AM | Updated on Jul 3 2026 12:58 AM

హసన్‌పర్తి : హసన్‌పర్తి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ కబ్జాదారులకు సహకరిస్తూ పట్టాదారులైన తమను బెదిరింపులకు గురి చేస్తున్నాడని రైతులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం హసన్‌పర్తి మండలం అన్నాసాగరం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు వైద్యుల స్వరూప, సమ్మిరెడ్డి మాట్లాడారు. అన్నాసాగరం శివారులోని సర్వే నంబర్‌ 74/బీ, 73/ఏ/1,77/ఏ/1,78/బీలో సుమారు 4.03ఎకరాల భూమి ఉందన్నారు. ఈభూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకం పొంది రైతుభరోసా డబ్బులు కూడా తీసుకుంటున్నట్లు వివరించారు. అయితే ఇందులో 1.06 ఎకరాల భూమిని ఇదే గ్రామానికి చెందిన ప్రతాప్‌ రెడ్డి కబ్జా చేశాడని ఆరోపించారు. ఈవిషయమై పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తే ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ తమనే బెదిరింపులకు గురిచేస్తూ కోర్టుకు వెళ్లమని హుకుం జారీచేస్తున్నాడని తెలిపారు. తమ వద్ద రెవెన్యూ అధికారులు సర్వే చేసిన మ్యాప్‌తో పాటు పట్టాదారుపాస్‌ పుస్తకాలు ఉన్నాయని చూపిస్తే.. క్షేత్రస్థాయికి వెళ్లినట్లయితే కేసు నమోదు చేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. భూమి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదన్నారు. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నుంచి తమకు ప్రాణభయం ఉందని చెప్పారు. ఇలాగే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వేధింపులకు గురి చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయమై కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని వైద్యుల స్వరూప, సమ్మిరెడ్డి తెలిపారు.

పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నుంచి ప్రాణభయం

విలేకరుల సమావేశంలో

రైతుల ఆవేదన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement