● ఇంటర్ విద్య ఆర్‌జేడీ గోపాల్
విద్యారణ్యపురి : ఇంటర్ వృత్తి విద్య కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 13న నిర్వహించనున్న అప్రెంటిస్ జాబ్‌మేళాను వినియోగించుకోవాలని ఇంటర్ విద్య ఆర్‌జేడీ ఎ. గోపాల్ కోరారు. ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్, హైదరాబాద్ ఆర్‌డీఎస్‌డీఈ సంయుక్త ఆధ్వర్యంలో 2023 నుంచి 2026 విద్యాసంవత్సరాల్లో ఇంటర్ వృత్తి విద్య కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు హనుమకొండలోని ప్రభుత్వ వృత్తివిద్య జూనియర్ కళాశాలలో అప్రెంటిస్ జాబ్‌మేళా నిర్వహించబోతున్నామన్నారు. ఈ మేరకు గురువారం ఈ కళాశాలలో అప్రెంటిస్ జాబ్‌మేళా సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు విస్తృత ప్రచారం కల్పించి ఎక్కువ సంఖ్యలో ఆయా విద్యార్థులు అప్రెంటిస్ జాబ్‌మేళాకు హాజరయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఈ జాబ్‌మేళాలో ఎంపికై న వారికి ఆర్‌డీఎస్‌డీఈ వారు నెలకు రూ. 9,600 స్టైఫండ్ కూడా చెల్లిస్తారన్నారు. పారామెడికల్, ఇంజనీరింగ్, కామర్స్, కంప్యూటర్, హోమ్‌సైన్స్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ బి. వెంకన్న, ప్రభుత్వ వృత్తివిద్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.శ్రీధర్, వివిధ జిల్లాల ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆర్. శ్రీనివాస్‌రావు, కె. మాధవరావు, బి.కవిత, భగవద్గీత, ఎం. మంజుల, తదితరులు పాల్గొన్నారు.


