అంగన్వాడీలా | - | Sakshi
Sakshi News home page

అంగన్వాడీలా

Jul 2 2026 2:29 AM | Updated on Jul 2 2026 2:29 AM

సాక్షి, మహబూబాబాద్‌: బాలికా సంరక్షణ, మాతా,శిశుసంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య ఏటేటా తగ్గుతోంది. ప్రధానంగా పిల్లలను కిడ్స్‌ సెంటర్లకు పంపించడంతో అంగన్‌వాడీ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. దీంతో గర్భిణులు, బాలింతల నమోదుతోనే కేంద్రాలు నిర్వహించాల్సి వస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ప్రీ స్కూల్స్‌ ప్రారంభిస్తే అంగన్‌వాడీ సెంటర్లలో పిల్లలు ఉండడం కష్టమే అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

తగ్గుతున్న పిల్లలు..

గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు వెళ్లడం.. మూడు సంవత్సరాల నిండక ముందే పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలకు పంపిస్తున్నారు. దీంతో ఏటేటా అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య తుగ్గుతోంది. మూడు సంవత్సరాల క్రితం జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలు 40వేలకు పైగా ఉండేవారు. కానీ, ఇప్పుడు 34,012 మంది మాత్రమే ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ లెక్కలో కూడా మరో రెండు, మూడు వేలు తగ్గిందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 1,437 సెంటర్లు ఉండగా ఇందులో.. ఐదు సెంటర్లు పిల ్లలు లేనివి ఉన్నాయి. ఐదుగురు పిల్లల వరకు ఉన్న కేంద్రాలు 24, పదిలోపు మంది పిల్లలు ఉన్నవి 79 ఉండగా, 15 మంది లోపు ఉన్నవి 198 సెంటర్లు, 20 మందిలోపు పిల్లలు ఉన్న సెంటర్లు 164 ఉన్నాయి.

ప్రీ స్కూల్స్‌ వస్తే...

ఇప్పుడే ఇలా ఉంటే ప్రీస్కూల్స్‌ ఏర్పాటు చేస్తే అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల సంఖ్య మరింత పడిపోతుంది. సెంటర్లు నడవడం ప్రశ్నార్థకంగా మారుతుందని అంగన్‌వాడీ ఉద్యోగుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న సెంటర్లనే ప్రీ స్కూల్స్‌గా మార్చాలని, ప్రస్తుతం బోధిస్తున్న టీచర్లకే బాధ్యతలు అప్పగించాలని ఉద్యో గ సంఘాల ఆద్వర్యంలో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇదిలా ఉండగా ఇంటర్మీడియట్‌ అర్హతతో ఇంగ్లిష్‌ మీడియంలో బోధించేందుకు జిల్లాలో 76 ప్రీ స్కూల్స్‌ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావొస్తుంది. ఇందులో పనిచేందుకు డిగ్రీ, డీఈడీ, బీఈడీ, పీజీలతోపాటు, ఇంజనీరింగ్‌ చదివిన వారు కూడా పోటీ పడడం గమనార్హం.

పిల్లలు

సెంటర్లు

11-15

198

06-10

79

16-20

164

05

24

20కి

పైగా

968

రెండు సెంటర్లు ఒకేచోట నడుస్తున్న తుమ్మల చెరువుతండా అంగన్‌వాడీ సెంటర్‌

అంగన్‌వాడీ సెంటర్లలో తగ్గుతున్న పిల్లల నమోదు

గర్భిణులు, బాలింతలతోనే

సెంటర్ల కొనసాగింపు

ప్రీ స్కూల్స్‌ ప్రారంభిస్తే మరింత ప్రభావం ఉంటుందని టీచర్ల ఆందోళన

పిల్లల వివరాలు

పిల్లల సంఖ్యకు అనుగుణంగా సెంటర్లు

అంగన్‌వాడీ సెంటర్లలో పిల్లల సంఖ్య తగ్గుతున్న విషయం వాస్తవమే. అయితే పిల్లల సంఖ్యను ఆధారంగా చేసుకొని సెంటర్ల నిర్వహణ ఉంటుంది. తక్కువ మంది పిల్లలు ఉన్న సెంటర్లను సమీపంలోని ఉన్న సెంటర్‌లో కలిపి అందరు కలిసి బోధించేలా చర్యలు తీసుకుంటున్నాం. సెంటర్‌కు సెంటర్‌కు మధ్య దూరం ఎక్కువగా ఉంటే పిల్లలు లేకపోయినా గర్భిణులు, బాలింతలకోసం సెంటర్‌ నిర్వహిస్తున్నాం.

– శిరీష, ఇన్‌చార్జ్‌ డీడబ్ల్యూఓ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement