కరుణించని వరుణుడు | - | Sakshi
Sakshi News home page

కరుణించని వరుణుడు

Jul 2 2026 2:29 AM | Updated on Jul 2 2026 2:29 AM

బయ్యారం/ మహబూబాబాద్‌ రూరల్‌: జిల్లాలో ఇప్పటి వరకు ఆశించినస్థాయిలో వర్షాలు పడలేదు. దీంతో చెరువులు, కుంటలు వెలవెలబోయి కనిపిస్తున్నాయి. జిల్లాలో ప్రధాన నీటి నరులైన బయ్యారం, గార్ల పెద్దచెరువులతో పాటు కంబాలపల్లి చెరువు, తులారాం ప్రాజెక్టులోకి కొత్తనీరు చేరని పరిస్థితి ఉంది. దీంతో పంటల సాగు గణనీయంగా తగ్గింది.

బోర్లు, బావుల కిందే సాగు మొదలు..

జిల్లాలోని 18 మండలాల పరిధిలోని చెరువులు, కుంటల్లో నీరు చేరకపోవడంతో వాటి ఆయకట్టు పరిధిలో ఈ ఏడాది పంటల సాగు మొదలు కాలేదు. బోర్లు, బావుల ఆధారం ఉన్న రైతులు ఇప్పటికే వరినారు పోయగా పత్తి, మొక్కజొన్న, పసుపు తదితర పంటల సాగును రైతులు ప్రారంభించారు. అప్పుడప్పుడు పడుతున్న వర్షాలకు చెరువులు, కుంటల పరిధిలో భూములు ఉన్న రైతులు వరినారు పోసేందుకు సిద్ధమవుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో నీరు చేరితేనే వరి నాట్లు అయ్యే పరిస్థితి ఉంది.

జిల్లాలో జాడలేని వర్షాలు

నీరు లేక వెలవెలబోతున్న చెరువులు, కుంటలు

జిల్లాలో గణనీయంగా తగ్గిన పంటల సాగు

జిల్లాలో జూన్‌లో నమోదైన వర్షపాతం(మిల్లీమీటర్లలో..)

మండలం కురిసింది సాధారణం

కొత్తగూడ 117.5 178.3

గంగారం 117.4 169.4

బయ్యారం 162 142.6

గార్ల 178.7 142.9

డోర్నకల్‌ 147.6 129.8

కురవి 95.3 133.7

మహబూబాబాద్‌ 96.7 142.3

గూడూరు 86.2 184.2

కేసముద్రం 48.1 145

నెల్లికుదురు 73.8 123.8

నర్సింహులపేట 96.4 112.6

చిన్నగూడూరు 67.3 133.4

మరిపెడ 189.6 136.9

దంతాలపల్లి 90.3 118.2

తొర్రూరు 118.5 139.2

పెద్దవంగర 167.9 118.9

సీరోలు 113.3 132.1

ఇనుగుర్తి 36.9 132.2

జిల్లా మొత్తం 111.6 139.8

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement