● డీఈఓ సత్యనారాయణమూర్తి
కురవి: విద్యార్థుల హాజరుశాతం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని డీఈఓ సత్యనారాయణమూర్తి సూచించారు. బుధవారం మండలంలోని రాజోలు జెడ్పీ హైస్కూ ల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, అన్ని తరగతి గదులను సందర్శించి పరిశీలించారు. అన్ని రికార్డులను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై సూచనలు, సలహాలు అందజేశారు. ప్రతీ విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి కోసం ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం మోహన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


