● ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి
మహబూబాబాద్ అర్బన్: ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్, పీఆర్సీ సాధిస్తామని ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడి అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని అనంతారం మోడల్ స్కూల్‌లో బుధవారం పీఆర్టీయూ టీఎస్ జిల్లా, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రేషనలెజేషన్ మార్గదర్శకాల్లో అవసరమైన మార్పులు, కేజీబీవీ ఉపాధ్యాయుల జీతాల పెంపు కోసం ప్రభుత్వంతో చర్చించామన్నారు. గిరిజన సంక్షేమ పాఠశాలలో టైమ్‌టేబుల్ మార్పు అంశంపై చర్యలు తీసుకుంటామని, జిల్లాలో ప్రతీ ఉపాధ్యాయుడు తప్పనిసరిగా పీఆర్టీయూ సభ్యుత్వం తీసుకోవాలన్నారు. ఆశ్రమ పాఠశాలలో పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్‌కు కృషి చేస్తున్నామని, మెడికల్ బిల్లుల క్లియరెన్స్ వేగవంతంగా చేస్తామన్నారు. 2003 డీఎస్ ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 1నుంచి ఓపీఎస్ అమలు దిశగా చర్యలు జరుగుతున్నాయని, సీపీఎస్ రద్దు కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయించే వరకు పీఆర్టీయూ పోరాటం కొనసాగిస్తుందన్నారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మిర్యాల సతీష్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, ఏఐఎఫ్‌టీఓ జాతీయ ఉపాధ్యక్షురాలు గీత, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, బద్రినారాయణ, హాల్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.


