మరిపెడ: శాంతిభద్రతలను పరిరక్షించాలని ఎస్పీ శబరీష్ పోలీసు అధికారులను ఆదేశించారు. మరిపెడ పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు సేవల నాణ్యత, దర్యాప్తు విధానం స్టేషన్ నిర్వహణపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా స్టేషన్ రికార్డులు, సీడీ ఫైళ్లు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, వివిధ విభాగాల పనితీరు, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రతను క్షణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్టేషన్ అధికారులతో సమావేశమై పెండింగ్ కేసులు, విచారణ నివేదికల తయారీ, దర్యాప్తు నాణ్యత, సమయపాలనపై సమీక్ష నిర్వహించారు. ప్రతీ కేసులో చట్టపరమైన విధివిధానాలను కచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాల్లో విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో సంబంధాలు కొనసాగించాలని సూచించారు. నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్, మరిపెడ సీఐ పవన్, ఎస్సై గండ్రాతి సతీష్, అదనపు ఎస్సై మహిబూబి సిబ్బంది పాల్గొన్నారు.


