సంగెం : సంగెం మండలంలో భారీగా గంజాయి పట్టుబడింది. బుధవారం సంగెం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్ వివరాలు వెల్లడించారు. సంగెం మండలం చింతలపల్లి రైల్వే గేట్ సమీపంలో మంగళవారం ఎస్సై వంశీకృష్ణ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి రెండు బ్యాగులతో అనుమానాస్పదంగా సంచరిస్తున్నా డు. దీంతో అదుపులోకి తీసుకుని అతడి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా 10 ప్యాకెట్లలో 9.418 కిలోల సుమారు రూ. 4,70,900 విలువైన ఎండుగంజాయి లభించింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన షోయబ్‌ఖాన్ మరో వ్యక్తి నుంచి కొనుగోలు చేసి సంగెం–గీసుకొండ మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులకు అధిక ధరలకు విక్రయించేందుకు తీసుకున్నట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో అరెస్ట్ చేసి కోర్టులో హజరు పరిచినట్లు తెలిపారు. కాగా, ఎస్సై వంశీకృష్ణ, హెడ్‌కానిస్టేబుల్ బాబు, కానిస్టేబుళ్లు శ్రవణ్, నవీన్, పాష, వీరన్న, రాజును సీఐ అభినందించారు.
వ్యక్తి అరెస్ట్, రిమాండ్


