బైక్‌ను ఢీకొన్న కారు.. | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న కారు..

Jul 2 2026 2:29 AM | Updated on Jul 2 2026 2:29 AM

వ్యక్తి మృతి..దొడ్లగడ్డతండాలో ఘటన

నర్మెట: బైక్‌ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం జనగామ జిల్లా నర్మెట మండలం హ న్మంతాపురం శివారు దొడ్లగడ్డతండాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన హేమ్లానాయక్‌ (55) బైక్‌పై తండాలోని బంధువుల ఇంటికెళ్లి తిరిగి స్వగ్రామం వస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా సిద్దిపేట జిలా మద్దూరు మండలం లద్నూర్‌కు చెందిన రాపాక రాజు తనకారులో నర్మెట నుంచి జనగామ వెళ్తూ బైక్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హేమ్లానాయక్‌ను స్థానికులు, కుటుంబీకులు నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నైనాల నగేశ్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement