కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

Jul 2 2026 2:29 AM | Updated on Jul 2 2026 2:29 AM

పద్దవంగర : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రామచంద్రు తండాలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రమోద్‌ కుమార్‌ గౌడ్‌ కథనం ప్రకారం.. తండాకు చెందిన బాదావత్‌ రవి (45) మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య కవిత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడు తల్లి సోనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement