కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య (సీడీఓఈ/ఎస్‌డీఎల్‌సీఈ)లో 2026–2027 విద్యాసంవత్సరంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు దూరవిద్య కేంద్రం డైరెక్టర్ బి. సురేశ్‌లాల్ బుధవారం తెలిపారు. ఈనెల 1 నుంచి సెప్టెంబర్ 15వ తేదీవరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కేయూ దూరవిద్య వెబ్‌సైట్‌లో కోర్సులు, వ్యవధి, విద్యార్హతలు, బోధనామాధ్యమం, అర్హతలు, ఫీజుల వివరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో నిర్ణీత ఫీజులు చెల్లించి అడ్మిషన్లు పొందాలని ఆయన కోరారు.
చిరుత పులి అడుగుల
ఆనవాళ్ల పరిశీలన
గూడూరు: గూడూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని తోటదస్రుతండా సమీప మామిడితోటలోకి మంగళవారం రాత్రి చిరుత పులి వచ్చినట్లు ప్రచారమైంది. దీంతో బుధవారం ఎఫ్‌ఆర్వో జి. ప్రసాదరావు సిబ్బందితో వెళ్లి మామిడితోటలో చిరుతపులి అడుగుల ఆనవాళ్లను పరిశీలించారు. రాత్రి మోస్తరు వర్షం కారణంగా ఆనవాళ్లు సరిగా కనిపించడం లేద ని, మొత్తానికి చిరుత రావొచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో అటవీ సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, అడవిలోకి ఒంటరిగా వె ళ్లొద్దన్నారు. ఎక్కడైనా చిరుత కనిపిస్తే తమకు సమాచారం అందించాలని ఎఫ్‌ఆర్వో కోరారు.


