రూ.277.61కోట్ల నిధులు జమ | - | Sakshi
Sakshi News home page

రూ.277.61కోట్ల నిధులు జమ

Jul 1 2026 12:52 AM | Updated on Jul 1 2026 12:52 AM

2,28,887మంది రైతులకు లబ్ధి

రైతు భరోసా సదస్సులో ఎమ్మెలే

భూక్య మురళీనాయక్‌

మహబూబాబాద్‌ రూరల్‌ : రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలోని 2,28,887మంది రైతులకు రూ.277.61కోట్ల నిధులు జమ అవుతాయని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో పాటు సదస్సు మాట్లాడారు. కాగా, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మానుకోట రైతు వేదిక నుంచి ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌, కలెక్టర్‌ స్నేహశబరీష్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గుగులోత్‌ జ్యోతి, డీఏఓ విజయచంద్ర, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న, ఏడీఏ శ్రీనివాసరావు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ యాదగిరి, ఏఓ తిరుపతిరెడ్డి వీక్షించారు. ఏటా ప్రతీ రైతుకు ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు బొల్లు రాజు, చిదిరాల అరుణజ్ఞానేశ్వర్‌, గాడిపల్లి లావణ్యచరణ్‌, వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు, ఉద్యాన అధికారులు, సెరీకల్చర్‌ అధికారులు, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement