● డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్
నెహ్రూసెంటర్: జిల్లాలో మూడు రోజుల పాటు చేపట్టిన పల్స్‌పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్‌పోలియో చుక్కలు వేశామన్నారు. 77,355 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు. మొదటి రోజు 469 కేంద్రాల్లో 73,570 మందికి, రెండో రోజు ఇంటింటి సర్వే ద్వారా 2,456మందికి, మూడో రోజు 1,329 మంది చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలు వేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి శివకుమార్, జిల్లా కోఆర్డినేటర్లు కె.స్వామి, ఏ.పురుషోత్తం, శ్రీనివాస్, ఎల్‌డీ కంప్యూటర్ అరుణ్, రాజ్యలక్ష్మి, రాజ్‌కుమార్, లింగారెడ్డి పాల్గొన్నారు.


