● పలు స్టేషన్లలో నిలిచిపోయిన రైళ్లు
డోర్నకల్: రైలింజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మంగళవారం పలు రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచాయి. వివరాలిలా ఉన్నాయి. నాగవల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(20809) రైలు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గుండ్రాతిమడుగు స్టేషన్ సమీపించగానే ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో రైలు స్టేషన్‌లో నిలిచింది. దీంతో మనర్‌గుడి–జోద్‌పూర్ ఎక్స్‌ప్రెస్, కేఎస్‌ఆర్ బెంగళూరు–దానాపూర్ ఎక్స్‌ప్రెస్ డోర్నకల్ రైల్వే స్టేషన్లలో సుమారు 40 నిమిషాల పాటు నిలిచాయి. భద్రాచలంరోడ్–సికింద్రాబాద్ కాకతీయ ఎక్స్‌ప్రెస్ డోర్నకల్ సమీపంలోని బ్రాంచ్‌లైన్‌లో గంట సేపు నిలవగా, తమిళనాడు, సహారా, ఏపీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పలు స్టేషన్లలో నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మామను బాత్రూంలో నిర్బంధించిన కోడలు
● కుటుంబ, ఆస్తి తగాదాలే కారణం
నర్సంపేట రూరల్: స్నానం కోసం బాత్రూంకు వెళ్లిన మామ బయటకు రాకుండా కోడలు గడియపెట్టిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేటలోని వరంగల్ రోడ్డులో రంగారెడ్డి నివసిస్తున్నాడు. అయితే, ఆయనకు తన కోడలు డాక్టర్ నవతతో ఆస్తి, కుటుంబ తగాదాలున్నాయి. స్నానానికి బాత్రూంకు ఆ యన వెళ్లగా కోడలు బయట గడియపెట్టి నిర్బంధించింది. దీంతో రెండు గంటలు బయటకు రాలేకపోయాడు. ఆయన అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి రంగారెడ్డిని బాత్రూం నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ తెలిపారు.
ఒక విద్యార్థిని.. ఒక ఉపాధ్యాయుడు
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కంబాలపల్లి పంచా యతీ పరిధిలోని కొత్తూరు ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విచిత్ర సన్నివేశం కనిపించింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ఆ పాఠశాలలో ఈ ఏడాది ఇద్దరు విద్యార్థులు మాత్రమే పేరు నమో దు చేసుకున్నారు. వీరిలో రెండో తరగతి విద్యార్థిని మాత్రమే పాఠశాలకు హాజరుకాగా.. పక్కనే ఉన్న అంగన్‌వాడీ చిన్నారితో కలిపి ఉపాధ్యాయుడు బోధించారు.
వ్యక్తి మృతికి కారణమైనవారి అరెస్ట్
చిట్యాల: మానేరు వాగులో విద్యుత్ వైర్‌తో చేపలు పడుతూ ఇటీవల మేకల రాజు అనే వ్యక్తి మృతి చెందిన కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ మల్లేష్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన వెళ్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 28 మండలంలోని కాల్వపల్లికి చెందిన మనబోతుల రఘుపతి, భూక్యా సమ్మయ్యలతోపాటు మరో ఇద్దరు మైనర్లు చేపలు పట్టేందుకు వెళ్తూ మేకల రాజును తీసుకెళ్లారు. ఈ క్రమంలో వ్యవసాయ మోటార్ స్టార్టర్ నుంచి అక్రమంగా విద్యుత్ సరఫరా తీసుకుని నీటిలో తీగ సాయంతో కరెంట్ షాక్ పెట్టి చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంలో రాజు మృతి చెందాడు. ఈ మేరకు నలుగురు నిందితులు కలిసి మంగళవారం గిద్దెముత్తారం సమీపంలో బెయిల్ కోసం ప్రయత్నించేందుకు వెళ్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. అనంతరం నిందితుల నుంచి విద్యుత్ వైర్‌ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
గూడూరు రేంజ్ అడవిలో చిరుత
గూడూరు: వరంగల్ జిల్లా ఖానాపురం మండల పరిధి గ్రామాల్లో సంచరిస్తున్న చిరుతపులి మంగళవారం రాత్రి మహబూబాబాద్ జిల్లా గూడూరు ఫారెస్టు రేంజ్ పరిధిలోనికి వచ్చినట్లు ఎస్సై బి.గిరిధర్‌రెడ్డి, ఎఫ్‌ఆర్వో జి.ప్రసాదరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఖానాపురం మండలం రాగంపేట సమీపంలో సంచరించిన చిరుత మంగళవారం రాత్రి గూడూరు మండలంలోని మర్రిమిట్ట శివారు తోటదస్రు తండా, మర్రిమిట్ట జీపీ, గూడూరు ప్రాంతాల్లోకి చేరుకున్నట్లు తెలిపారు. తోటదస్రు తండా సమీపంలోని ఓ మామిడి తోటలో చిరుత సంచారంతో కుక్కలు అరిచాయని, చిరుత రోడ్డు దాటుతుండగా చూసిన ఓ వ్యక్తి సమాచారంతో చిరుత ఆ ప్రాంతంలో ఆనవాళ్లు గుర్తించడానికి వెళ్లగా వర్షం కారణంగా గుర్తులు కనిపించలేదని ఎఫ్‌ఆర్వో ప్రసాదరావు తెలిపారు.
కాశిబుగ్గ: డాక్టర్స్ డే సందర్భంగా వరంగల్ ఐఎంఏ ఆధ్వర్యంలో నగరానికి చెందిన 10 మంది ఉత్తమ డాక్టర్లను ఎంపిక చేశారు. వరంగల్ ఐఎంఏ హాల్‌లో బుధవారం రాత్రి 8 గంటలకు వారిని సన్మానించి ఉత్త మ డాక్టర్ అవార్డులు అందజేయనున్నారు. ఎస్.గోపినాఽథ్, ఎ.అప్ప య్య, బి.రాధాకృష్ణ, ఎం.పుల్లారెడ్డి, జి.చంద్రశేఖర్, బేతి కవిత, పి.అశోక్‌కుమార్, జలగం మాధవి, అజిత్ మహ్మద్, జలగం కావ్యారావు ఉత్తమ డాక్టర్ అవార్డులు అందుకోనున్నారు. ముఖ్య అతిథిగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ పి.కాళీప్రసాద్, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి.విజయ్‌చందర్‌రెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్‌దాస్, ఎంజీఎం ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.రాంకుమార్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓలు డాక్టర్ ఎస్‌డీ రాంకుమార్, డాక్టర్ బి.సాంబశివరావు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.నాగార్జునరెడ్డి పాల్గొంటారు.


