● 2,456 మంది చిన్నారులకు
చుక్కల పంపిణీ
నెహ్రూసెంటర్: పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా సోమవారం ఇంటింటికి వెళ్లి ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మొదటిరోజు పల్స్‌పోలియో చుక్కలు వేసుకోని పిల్లలను గుర్తించి రెండోరోజు 2,456 మందికి వేసినట్లు చెప్పారు. జిల్లాలో 938 బృందాల వైద్య సిబ్బంది సర్వే చేపట్టారని, రెండు రోజుల పాటు చుక్కలు వేసుకోని పిల్లలకు నేడు (మంగళవారం) వేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇమ్యూనైజేషన్ అధికారి శివకుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.


