ఇదీ ఒక రోడ్డేనా? | - | Sakshi
Sakshi News home page

ఇదీ ఒక రోడ్డేనా?

Jun 30 2026 1:18 AM | Updated on Jun 30 2026 1:18 AM

గుంతలు పడిన రోడ్డుపై

ఎంపీ చామల ఆగ్రహం

బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి సిద్దిపేట జిల్లా చేర్యాల రూట్‌లో కొడవటూరు కమాన్‌ వరకు రోడ్డు అధ్వానంగా తయారైంది. అడుగుకో గుంత అన్నట్టుగా రోడ్డంతా గుంతలమయమే. సోమవారం బచ్చన్నపేట నుంచి చేర్యాలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి వెళ్తుండగా జాతీయ రహదారి–365 బీపై గుంతలను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఆర్‌అండ్‌బీ డీఈకి ఫోన్‌ చేసి ఈ గుంతల రో డ్డుకు వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. కాగా, మండల పరిధిలో సుమారు రెండు కి లోమీటర్ల మేర అడుగడుగునా గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శాశ్వత పనులు చేపట్టి రహదారిని ప్రయాణయోగ్యంగా మార్చాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement