హన్మకొండ అర్బన్ : రాబోయే రెండు దశాబ్దాలు విద్యారంగానికి అత్యంత కీలకమని, ‘డిగ్రీ దండగ కాదు.. పండుగ’అని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అన్నారు. నగరంలోని మాస్టర్ జీ పీజీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నూతన డిగ్రీ, పీజీ సిలబస్‌పై సోమవారం అధ్యాపకులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నూతన సిలబస్‌లో విద్యార్థుల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు, ట్రెండింగ్ సబ్జెక్టులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అధ్యాపకులు నూతన సిలబస్‌పై పూర్తి అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలన్నారు. మాస్టర్ జీ విద్యాసంస్థల చైర్మన్ సంఘం రెడ్డి సుందర్‌రాజ్ మాట్లాడుతూ అధ్యాపకులు ఎప్పటికప్పుడు సిలబస్‌లో వస్తున్న మార్పులను తెలుసుకుంటూ విద్యార్థులు ఉద్యోగాల్లో రాణించేలా తీర్చిదిద్దాలన్నారు. కేయూ ఓఎస్డీ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ నూతన సిలబస్ రూపకల్పనలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి పలు సూచనలు అందించినట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ బి. పోలరామ్, జనరల్ సెక్రటరీ సంఘం రెడ్డి అచ్యుత్‌రాజ్, విశ్వరాజ్, ధనరాజ్, లక్ష్మీనర్సింహారావు, సూర్యనారాయణ, ధనలక్ష్మి, స్రవంతి, శ్రీనివాస్, అశోక్, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
దేశాభివృద్ధికి గణాంకాలే బలమైన పునాది..
కేయూ క్యాంపస్: దేశాభివృద్ధికి గణాంకాలే బలమైన పునాది అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చై ర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అన్నారు. సోమవా రం భారతీయ గణాంక శాస్త్ర పితామహుడు చంద్రమహబిల నోబిస్ జయంతి సందర్భంగా కేయూలో ని స్టాటిస్టిక్స్ విభాగం సెమినార్‌హాల్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశాభివృద్ధికి గణాంకాలు కేవలం సంఖ్యల సమాహారం మాత్రమేకాకుండా ప్రభుత్వ విధానాల రూపకల్పన, సంక్షేమ పథకాల అమలు, పారదర్శక పాలనకు సమర్థవంతమైన నిర్ణయాల మూలాధారంగా నిలుస్తాయన్నారు. మహల నోబి స్ శాసీ్త్రయ దృక్పథం నేటికీ దేశ ప్రణాళిక వ్యవస్థకు మార్గదర్శకమన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం మాట్లాడుతూ గణాంక శాస్త్రం ప్రతీవిద్యార్థికి అవసరమైన ప్రాథమిక విజ్ఞానంగా మారిందన్నారు. అనంతరం ఓఎస్‌డీ బి. వెంకట్రామ్‌రెడ్డి, కేయూ స్టూడెంట్స్ ఆఫైర్స్ డీన్ ఇస్తారి, స్టాటిస్టిక్స్ విభాగం అధిపతి జె. శ్రీనివాస్, కేయూ స్టాటిస్టిక్స్ విభాగం రిటైర్డ్ ఆచార్యుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. వైస్ ప్రిన్సిపాల్ మమత, యూత్‌వెల్ఫేర్ ఆఫీసర్లు బి. నిరంజన్, శ్రీనివాస్, రాధిక, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి


