అదనపు డీసీపీ పనితీరు అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

అదనపు డీసీపీ పనితీరు అభినందనీయం

Jun 30 2026 1:12 AM | Updated on Jun 30 2026 1:12 AM

అదనపు డీసీపీ పనితీరు అభినందనీయం

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్‌ క్రైం: అడిషనల్‌ డీసీపీ రవి పనితీరు అభినందనీయమని వరంగల్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. పోలీస్‌శాఖలో సుదీర్ఘకాలంగా వివిధ హోదాల్లో పనిచేసి వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ అడిషనల్‌ డీసీపీ, అడ్మిన్‌ హోదాలో ఉద్యోగ విరమణ చేస్తున్న అడిషనల్‌ డీసీపీకి పరిపాలన విభాగం సిబ్బంది వీయం.కల్యాణ వేదికలో ఏర్పాటు ఆత్మీ య వీడ్కోలు సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని అడిషనల్‌ డీసీపీని ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈసందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ.. సిబ్బందికి సంబంధించి శాఖాపరమైన సమస్యలపై తక్షణమే స్పందించడంతో పాటు తనను సంప్రదించి వాటిని త్వరితగతిన పరిష్కరించి సిబ్బందికి సత్వరమే న్యాయం అందించేవాడని, అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహించడంలో అడిషనల్‌ డీసీపీ రవి ప్రత్యేకతని సీపీ తెలిపారు. కార్యక్రమం ఏఓ సంపత్‌కుమార్‌, సూపరింటెండెంట్లు రమేశ్‌, యాకుబ్‌ బాబా, సంధ్య, వహీద్‌, గిరి, పూజితతో పాటు సీపీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

భవనాల తొలగింపుపై సీపీ సమీక్ష

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో నూతన కమిషనరేట్‌ భవనం పరిసరాల్లోని పాత భవనాలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా పాత భావనాల్లో కొనసాగిస్తున్న వివిధ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరించాల్సి వస్తే సంబంధిత విభాగాలకు సంబందించిన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశంపై పోలీస్‌ కమిషనర్‌ అధికారులతో చర్చించారు. ఈసమీక్షలో అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్‌, శ్రీనివాస్‌, ఏసీపీ సురేంద్ర, అంతయ్య, ఆర్‌ఐలు శ్రీధర్‌, సతీశ్‌, స్పర్జన్‌ రాజ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement