నెహ్రూసెంటర్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన లిఫ్ట్ పనిచేయడం లేదు. నెలల తరబడి పనిచేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగిని ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, ఆర్థోవార్డుకు తీసుకెళ్లేందుకు సిబ్బందితో పాటు సహాయకులకు తిప్పలు తప్పడం లేదు. కాగా, లిఫ్ట్ రిపేర్‌లో ఉందా లేదా వినియోగించకుండా నిలిపివేశారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి లిఫ్ట్ అందుబాటులోకి వచ్చేలా చూడాలని రోగులు కోరుతున్నారు.
● పట్టించుకోని జిల్లా ఆస్పత్రి అధికారులు


