ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Jun 29 2026 1:17 AM | Updated on Jun 29 2026 1:17 AM

టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రంజిత్‌కుమార్‌

కాళోజీ సెంటర్‌: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి, పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్‌కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం టీఎస్‌యూటీఎఫ్‌ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్‌ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్‌కుమార్‌ మాట్లాడుతూ.. 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. గురుకుల, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు 010 హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ కింద వేతనాలు చెల్లించాలని, కేజీబీవీ ఉపాధ్యాయులకు కనీస వేతనం చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుజన్‌ప్రసాదరావు, ఉపాధ్యక్షుడు నామోజు శ్రీనివాస్‌, కోశాధికారి ఎస్‌ఏ రావూఫ్‌ తదితరలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement