నెహ్రూసెంటర్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కందునూరి కవిత అన్నారు. ఆదివారం ఐద్వా ముఖ్య నాయకుల సమావేశం సంఘ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలపై జరుగతున్న దాడులు, దౌర్జన్యాలపై మహిళాలోకం ఏకమై పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. మహిళలను చైతన్యపరిచి హక్కులు, చట్టాల అమలుపై, రిజర్వేషన్ల సాధనపై సంఘం ఆధ్వర్యంలో దశలవారి ఆందోళనలు చేపట్టాలన్నారు. మహిళలకు రక్షణ కల్పించడం, దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. సంఘం బలోపేతం కోసం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిఽధిలోని ప్రతీవార్డులో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఛాగంటి భాగ్యమ్మ, ములక వసంత, పంజాల ఉపేంద్ర, బోయిన సునీత, దర్శనపు మంజూల, కొమిర ఉమా తదితరులు పాల్గొన్నారు.


