ప్రస్తుతం నీరు తగ్గి కనిపిస్తున్న గోదావరి, ప్రాణహిత నదులు
త్రివేణి సంగమం వద్ద గతేడాది జూన్ 28న పుష్కరఘాట్‌కు చేరిన వరద(ఫైల్)
కాళేశ్వరం : జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ప్రతీ ఏడాది జూన్ 20 నాటికే సమృద్ధిగా వర్షాలు కురిసి గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగేవి. కానీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమైనా ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో గోదావరిలో నీటి ప్రవాహం కదలడం లేదు. మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే ప్రాణహిత, తెలంగాణ నుంచి వచ్చే గోదావరి నదులు ప్రస్తుతం స్వల్ప స్థాయి నీరుతోనే దర్శనమిస్తున్నాయి. గతేడాది ఇదే నెల 28 నాటికి గోదావరి నీరు పుష్కర ఘాట్ మెట్ల వరకు చేరి ప్రవహించిందని స్థానిక రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నదిలో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో భూగర్భ జలాలపై ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ నెల ముగుస్తున్నా వర్షాలు ఆలస్యం కావడంతో భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయే ప్రమాదం ఉందని, వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో పత్తి విత్తనాలు మొలకెత్తక పోవడంతో మళ్లీ రెండోసారి విత్తుతున్నారు. ఇప్పటికై నా వరుణుడు కరుణించి విస్తారంగా వర్షాలు కురిసి గోదావరిలో నీటి ప్రవాహం పెరగాలని రైతులు, ప్రజలు కోరుకుంటున్నారు.
నీటి ప్రవాహం లేకపోవడంతో
కదలని గోదావరి
ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన
స్థాయిలో కురవని వర్షాలు
ఫలితంగా స్వల్పస్థాయి నీటితోనే
దర్శనమిస్తున్న నది


