గిరిజనుల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యం

Jun 29 2026 1:17 AM | Updated on Jun 29 2026 1:17 AM

మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్‌

హన్మకొండ : గిరిజనుల అభివృద్ధికి కేంద్రంలోని న రేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని మాజీ ఎంపీ ప్రొఫెసర్‌, అజ్మీరా సీతారాం నాయక్‌ అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు గిరిజన తెగలను ఎస్‌టీలో కలిపిందని వివరించారు. ఆదివాసీ గిరిజన మహిళ ద్రౌపది ము ర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీది అన్నారు. ‘వికసిత్‌ భారత్‌–2047– గిరిజన అభివృద్ధి’ అనే అంశంపై నేడు హరిత కాకతీయ హోటల్‌లో గిరిజన ప్రతినిధులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ మేధోమధనం నిర్వహించనున్నారన్నారు. బీ జేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మాట్లాడుతూ రాష్ట్రాన్ని 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు గిరిజన అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేస్తే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు వ్యతిరేకించాయన్నారు. గిరిజన అభివృద్ధికి ప్రాధాన్యం ఇ స్తున్న మోదీ ప్రభుత్వం 23 ఏకలవ్య స్కూళ్లు ఏర్పా టు చేసిందని, సమ్మక్క సారలమ్మ గిరిజన యూ నివర్సిటీ ఏర్పాటుతోపాటు రూ.899 కోట్లు కేటా యించిందని వివరించారు. బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ట్రైబల్‌ డిక్లరేషన్‌ పేరుతో మోసం చేసిందని దుయ్యబట్టారు. నాయకులు మార్తినేని ధర్మారావు, వన్నాల వెంకటరమణ, గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, యాప సీతయ్య, రావు పద్మ, గంట రవికుమార్‌, కొండేటి శ్రీధర్‌, దిలీప్‌ నాయక్‌, మల్లాడి తిరుపతి రెడ్డి, బన్న ప్రభాకర్‌, అజ్మీరా కృష్ణవేణి, స్వరూప, పగడాల కాళీప్రసాద్‌, త్రిలోకేశ్వర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement