డ్రగ్స్‌ రహిత సమాజానికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత సమాజానికి కృషి చేయాలి

Jun 28 2026 2:50 AM | Updated on Jun 28 2026 2:50 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: డ్రగ్స్‌ రహిత సమాజానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. జిల్లాకేంద్రంలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో శనివారం సీ్త్ర శిశు సంక్షేమ, వయోవృద్ధులు, దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ స్నేహ శబరిష్‌ ఆదేశాల మేరకు విద్యార్థులకు మాదకద్రవ్యాల నిరోధకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ రవిరాథోడ్‌, జిల్లా ఎకై ్సజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ కిరణ్‌ కుమార్‌, డీఎస్పీ తిరుపతిరావు హాజరై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ మాదకద్రవ్యాల కట్టడికి ఎస్పీ షబరీష్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, ఎక్కడై ఖాళీ ప్రదేశాల్లో అనుమానిక వ్యక్తులను గుర్తించి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ ఇన్‌చార్జ్‌ అధికారి శీరిష, డీఐఈఓ మదార్‌గౌడ్‌, స్పెషల్‌ డిప్యూటీ ట్రైనింగ్‌ కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, డీవైఎస్‌ఓ జ్యోతి, ఏసీజీఈ మందుల శ్రీరాములు, ప్రిన్సిపాల్‌ రమేష్‌ కుమార్‌, ఎకై ్సజ్‌ సీఐ చీరంజీవి, చైల్డ్‌లైన్‌ అధికారులు చైతన్య, కమలాకర్‌, వీరన్న, నరేష్‌, హరీష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement