ప్రజారోగ్యంతో చెలగాటమాడొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యంతో చెలగాటమాడొద్దు

Jun 28 2026 2:50 AM | Updated on Jun 28 2026 2:50 AM

ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ ధర్మేందర్‌

మహబూబాబాద్‌/మహబూబాబాద్‌ రూరల్‌: వ్యా పారులు, రెస్టారెంట్ల నిర్వాహకులు, వైన్స్‌ షాపుల్లో క్యాంటిన్‌ నిర్వహించే వారు తప్పని జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యమైన వస్తువులు, తాజా నూనెను ఉపయోగించాలని ఫుడ్‌ సెఫ్టీ ఆఫీసర్‌ ధర్మేందర్‌ అ న్నారు. జిల్లా కేంద్రంలోని రెస్టారెంట్లను, వైన్స్‌షాపుల క్యాంటీన్‌లను శనివారం ఫుడ్‌ సెఫ్టీ ఆఫీసర్‌, మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ కరుణాకర్‌తో కలిసి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మరుగబెట్టిన నూనెను ఉపయోగిస్తున్నారని, అది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందన్నారు. చికెన్‌కు రంగులు పూస్తు హానికరమైన కెమికల్స్‌ కలుపుతున్నారన్నారు. పరిశుభ్రత కూడా పాటించడం లేదని మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. గంట పాటు రెస్టారెంట్లు, వైన్స్‌ క్యాంటీన్‌లు తనిఖీ చేయగా ని బంధనలకు విరుద్ధంగా ఉండటంతో రూ.36,000 జరిమానా విధించామన్నారు. ఆహార నిమయాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించా మన్నారు. ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేస్తామని, వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement