స్కూటీ డిక్కీ నుంచి రూ.2 లక్షలు మాయం | - | Sakshi
Sakshi News home page

స్కూటీ డిక్కీ నుంచి రూ.2 లక్షలు మాయం

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

పిడుగుపాటుకు ఆవులు మృత్యువాత

మానుకోటలో ఘటన

మహబూబాబాద్‌ రూరల్‌ : స్కూటీ డిక్కీ నుంచి రూ.2 లక్షల నగదు మాయమైంది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. పట్టణంలోని పత్తిపాక ప్రాంతంలో నివాసముండే గుగులోత్‌ రవి స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో సేల్స్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తన మిత్రుడు ఈసంపల్లి సాగర్‌కు గురువారం రూ.2 లక్షల నగదు బదలు ఇచ్చాడు. తిరిగి ఆ డబ్బు తీసుకోవడానికి శుక్రవారం కెనరా బ్యాంకు వద్దకు వెళ్లాడు. సాగర్‌ రూ.2 లక్షలు ఇవ్వగా ఆ డబ్బులను తన స్కూటీ డిక్కీలో పెట్టుకున్నాడు. అనంతరం మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లి మరో స్నేహితుడిని తీసుకొచ్చి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి వద్ద వదిలిపెట్టాడు. అనంతరం తాను పనిచేస్తున్న సంస్థ కార్యాలయం ఉండే భద్రాద్రి కోఆపరేటివ్‌ బ్యాంకు వద్దకు వచ్చి అక్కడ తన వాహనం పార్క్‌ చేసి లోపలికి వెళ్లాడు. కొంత సమయం తర్వాత స్కూటీ వద్దకు వెళ్లి డిక్కీ తెరిచి చూడగా అందులో భద్రపరిచిన రూ.2 లక్షలు కనిపించలేదు. దీంతో ఆందోళన గురైన బాధితుడు రవి వెంటనే మహబూబా బాద్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

పాలకుర్తి టౌన్‌ : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం లకావత్‌ తండా(తూర్పు) గ్రామంలో పిడుగుపడి రెండు ఆవులు మృత్యవాత పడ్డాయి. ఈ ప్రమాదంతో సుమారు రూ. 1.50 లక్షల నష్టం వాటినట్లు బాధిత రైతు తెలిపాడు. స్థానికుల కథనం ప్రకారం.. బాధి త రైతు లకావత్‌ లచ్చిరాం రోజు మాదిరిగానే ఆవులను పాకలో కట్టేశాడు. ఈక్రమంలో గురువారం రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. సమాచారం అందుకున్న మండల పశువైధ్యాఽధికారి స్వర్ణ శిల్ప, జీపీఓ వెంకటేష్‌, పంచాయతీ కార్యదర్శి ఘటనాస్థలిని పరి శీలించి పిడుగుపాటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. బాధిత రైతుకు పరిహారం అందించాలని గ్రామస్తులు కోరారు.

పిడుగుపాటుకు తాటిచెట్టుపైనుంచి

పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

పాలకుర్తి టౌన్‌ : పిడుగుపాటుకు తాటి చెట్టుపైనుంచి పడి ఓ గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం మండలంలోని విస్నూరు జరిగింది. గీత కార్మికుడు కన్న భిక్షం తాటి చెట్టు కల్లు ఎక్కి గీస్తున్నాడు. ఈ సమయంలో చెట్టుపై పిడుగు పడడంలో అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. భిక్షం పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబీకులు సభ్యులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement