దుగ్గొండి: నా పేరు నిషిత. నేను దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. వేసవి కాలంలో కథలు రాయడం నా హాబీ.. నేను రాసిన మూడో కథ ఇది.. అనగనగా ఒక ఊరిలో రా మయ్య అనే రైతు ఉండేవాడు. అతని కుమారుడి పేరు రాజు. రామ య్య తనకున్న ఆవు పాలను విక్రయించి కుటుంబ ఖర్చులకు ఉపయోగించేవాడు. కొన్నిరోజులకు ఆవు ముసలిద యింది. పాలు ఇవ్వడం మానేసింది. దీంతో ఆవును కసాయి వాడికి అమ్ముదామని తీసుకెళ్తున్నాడు. అదేసమయంలో ఎదురుగా వస్తున్న అతని కుమారుడు రాజు ఎక్కడి వెళ్తున్నావని అడుగుతాడు. ముసలి ఆవును కాసాయి వాడికి అమ్మి వస్తానని బదులివ్వడంతో రాజు ఇవా అంటాడు.. ‘చాలా ఏళ్ల పాటు ఈ ఆవు మన కుటుంబాన్ని పోషించింది. ఇప్పుడు ముసలిది అయిందని కసాయి వాడికి అమ్మేస్తే రేపు మీరు ఆ తర్వాత నేను ముసలి వాళ్లం అవుతాం. అప్పుడు నేను మిమ్ముల్ని, నన్ను నా కొడుకు వృద్ధాశ్రమంలో వదిలేయాలా.. నాన్న’ అని అడిగాడు. దీంతో రామయ్య షాక్‌కు గురయ్యాడు. కొడుకు మాటలు మనసుకు తాకాయి. వెంటనే రామయ్య ఆవును మళ్లీ తన ఇంటికే తీసుకెళ్లి దానికి ప్రతీరోజు ఆహారం అందించాడు.
నీతి: ప్రేమ, కృతజ్ఞత మనిషికి ఉండాల్సిన గొప్ప గుణాలు


